తెలంగాణలో మొదటిసారి 40 లక్షల ఎకరాల్లో వరి పండించిన సమయంలో... కరోనా విపత్తు రావడం బాధాకరమని ముఖ్యమంత్రి కేసీఆర్ విచారం వ్యక్తం చేశారు. కరోనా పరిస్థితి లేకుంటే పండిన పంటను చూసి డ్యాన్స్ చేసే వాడినని ఆయన చెప్పారు. ధాన్యం మొత్తం ఎట్టి పరిస్థితుల్లో కొంటామని మరోసారి స్పష్టం చేశారు.
కరోనా లేకుంటే డ్యాన్స్ చేసేవాడిని: తెలంగాణ సీఎం - CM KCR Corona Meeting
తెలంగాణలో ఈ ఏడాది పంటలు బాగా సాగు చేశారని సీఎం కేసీఆర్ అన్నారు. ఇంత భారీగా పంట పండటం చాలా ఆనందమని... కరోనా లాంటి పరిస్థితి లేకపోతే తాను డ్యాన్స్ చేసేవాడినని కేసీఆర్ చెప్పుకొచ్చారు.
ఈ ఏడాది పంటలు బాగా సాగు చేశారు
గన్నీ బ్యాగుల కొరత లేకుండా పశ్చిమ బంగ నుంచి తీసుకువచ్చే ప్రయత్నం చేస్తున్నామని సీఎం పేర్కొన్నారు. తెలంగాణలో గన్నీ బ్యాగుల తయారీ పరిశ్రమల ఏర్పాటుకు.. ప్రణాళికలు సిద్ధం చేయాలని కేటీఆర్‌కు సూచించానని సీఎం తెలిపారు. వారికి ప్రోత్సాహకాలు అందిస్తామని కేసీఆర్ పేర్కొన్నారు.
ఇదీ చూడండి:వైరస్‌కు ఉక్కపోత.. ఉష్ణ మండలంలో వ్యాప్తి తక్కువే!