గుంటూరు జిల్లా తెనాలి ప్రాంతం చెంచుపేటకు చెందిన ఓ మహిళ భర్త ఉస్మాని కౌంటర్ ఇంటలిజెన్స్ కానిస్టేబుల్‌గా పని చేస్తున్నారు. అతను వేరే మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకుని భార్యను నిర్లక్ష్యం చేస్తున్నారు. దీనిపై ఉస్మాని భార్య కుటుంబసభ్యులు గుంటూరులోని దిశ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. అక్కడ కేసు నమోదు చేయకుండా సదరు కానిస్టేబుల్ని పిలిపించి కౌన్సిలింగ్ ఇస్తామని చెప్పారు. అంతా కలిసి కేసును నీరుగార్చేందుకు యత్నిస్తున్నారనే అనుమానంతో మహిళ సోదరి వారి ఫొటోలు తీసేందుకు ప్రయత్నించింది.
'సమస్య పరిష్కరించమని వెళ్తే.. సీఐ కొట్టాడు..!' - మహిళపై సీఐ దాడి వార్తలు
తమ కుటుంబ సమస్యలను పరిష్కరించమని మహిళ పోలీస్‌స్టేషన్‌కి వెళితే తనపై సీఐ దాడి చేశారని ఓ మహిళ ఆవేదన వ్యక్తం చేసింది. తనపై దాడి చేసిన సీఐపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని జిల్లా ఎస్పీకి, మహిళా కమిషన్ ఛైర్‌పర్సన్‌కి ఫిర్యాదు చేసింది. వారు కూడా పట్టించుకోవడంలేదని బాధితురాలు ఆరోపించింది. తనకు న్యాయం చేయాలని ముఖ్యమంత్రిని, డీజీపీని కోరింది.
అగ్రహించిన సీఐ... బాధితురాలు, ఆమె బంధువులపై దాడి చేశారు. ఈ నెల 7వ తేదిన జరిగిన ఘటనపై రెండుసార్లు గుంటూరు అర్బన్ ఎస్పీ అమ్మిరెడ్డి, మహిళా కమిషన్ ఛైర్‌పర్సన్‌కి ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని భాదితురాలు వాపోయింది. దాడి చేసిన సీఐ కేసు వెనక్కు తీసుకోవాలని... లేకపోతే తన అక్కాబావను విడదీస్తానని బెదిరిస్తున్నాడని తెలిపింది. తనకు న్యాయం జరిగే వరకు పోరాటం చేస్తానని స్పష్టం చేసింది. డీజీపీ గౌతం సవాంగ్, ముఖ్యమంత్రి జగన్ స్పందించాలని కోరింది.
ఇదీ చదవండీ... తగ్గని ఉద్ధృతి.. 24 గంటల వ్యవధిలో 9,927 కరోనా కేసులు