అన్‌లాక్ 4.0లో భాగంగా సెప్టెంబరు 7 నుంచి మెట్రో రైళ్లకు కేంద్రం అనుమతి ఇచ్చింది. కొవిడ్ పరిస్థితులను బట్టి అంతిమ నిర్ణయం రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకోవాల్సి ఉంటుంది. హైదరాబాద్‌లో నడపాలా? వద్దా అనే దానిపై తెలంగాణ ప్రభుత్వం ఇంకా నిర్ణయం వెలువరించలేదు. ఇప్పటికే దిల్లీ ప్రభుత్వం మెట్రోలు నడపాలని నిర్ణయించింది. ప్రయాణికుల భద్రత దృష్ట్యా స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్(ఎస్‌ఓపీ)ని విడుదల చేసింది.
హైదరాబాద్‌లోనూ నడిపేందుకు అనుమతి లభిస్తే.. దాదాపు ఇవే విధి విధానాలు ఉండొచ్చని మెట్రో వర్గాలు అంటున్నాయి. ఇందులో డిజిటల్ చెల్లింపుల ద్వారానే మెట్రో యానం ప్రధానం.
విధివిధానాలు ఇలా ఉండొచ్చు...
నగదు రహితం:స్మార్ట్ కార్డులతోనే ప్రయాణానికి అనుమతి. రూ.50తో ఈ కార్డు తీసుకోవచ్చు. రూ.20 డిపాజిట్ కింద మినహాయిస్తారు. మిగతాది ప్రయాణ ఛార్జీకి వాడొచ్చు. కార్డులను డిజిటల్ చెల్లింపులతోనే కొనాలి.