Refund for TSRTC cancelled ticket: బస్సు సర్వీసు రద్దయితే ప్రయాణికుడు బుక్ చేసుకున్న టికెట్టు ఆటోమెటిక్‌గా రద్దయినట్టే అని.. దానికి పరిహారం చెల్లించాల్సిందేనని హైదరాబాద్ జిల్లా వినియోగదారుల కమిషన్-1 బెంచ్ పేర్కొంది. మోతీనగర్‌కు చెందిన కె.రమేశ్ హైదరాబాద్ నుంచి పాల్వంచ వెళ్లేందుకు 2020 ఆగస్టు 23న ఆన్‌లైన్‌లో రెండు బస్సుల్లో వేర్వేరుగా రెండు టికెట్లు బుక్ చేశారు. ఒక్కో టికెట్‌కు రూ.469 చెల్లించారు. అనివార్య కారణాలతో రెండు సర్వీసులూ రద్దయ్యాయి. ఆగస్టు 23న రూ.468.. సెప్టెంబరు 30న రూ.15 చొప్పున డబ్బు రిఫండ్ అయ్యింది. ఒక టికెట్టుపై కేవలం రూ.15 మాత్రమే తిరిగి ఇవ్వడంపై ఆయన ఆన్‌లైన్‌లో టీఎస్ ఆర్టీసీకి ఫిర్యాదు చేశారు.
TSRTC సర్వీసు రద్దయితే టికెట్టు రద్దయినట్టే, పూర్తి డబ్బు వాపస్ - TSRTC cancelled ticket refund
Refund for TSRTC cancelled ticket ఆన్‌లైన్‌లో బస్సు టికెట్లు బుక్ చేసుకుంటాం. వీలుకాకో, పని వాయిదా పడో ఇలా కారణమేదైనా వెళ్లలేకపోతే టికెట్ క్యాన్సిల్ చేసుకుంటాం. అలా క్యాన్సిల్ చేసుకుంటే.. ఆ టికెట్ ధరలో కొంత శాతం మాత్రమే రీఫండ్ అవుతుంది. దాన్ని సవాలు చేస్తూ ఓ ప్రయాణికుడు చేసిన ఫిర్యాదుపై హైదరాబాద్ జిల్లా వినియోగదారుల కమిషన్ బెంచ్ ఆసక్తికర తీర్పు చెప్పింది.
"సర్వీసు రద్దయితే ప్రయాణికుడు 15 రోజుల్లోగా టికెట్ రద్దు చేసుకోవాలని, అప్పుడే పూర్తి రిఫండ్ వస్తుందని" సంస్థ తెలిపింది. దీంతో రమేశ్ హైదరాబాద్ జిల్లా వినియోగదారుల కమిషన్‌ను ఆశ్రయించారు. కమిషన్ బెంచ్ అధ్యక్షురాలు బి.ఉమావెంకట సుబ్బలక్ష్మి, సభ్యులు సి.లక్ష్మీప్రసన్న, ఎస్.మాధవి విచారణ జరిపారు. సర్వీసును రద్దు చేయడంలో ఫిర్యాదీ ప్రమేయం ఉండదు కనుక.. సర్వీసు రద్దయితే టికెట్టూ రద్దయినట్టే అని స్పష్టం చేసింది. రమేశ్‌కు రూ.453 తిరిగి ఇవ్వడంతో పాటు కేసు ఖర్చులు రూ.10వేలు, 45 రోజుల్లో చెల్లించాలని ఆర్టీసీని ఆదేశించింది. గడువు దాటితే 12శాతం వడ్డీతో చెల్లించాల్సి ఉంటుందని హెచ్చరించింది.
ఇవీ చదవండి: