IAS TRANSFERS: రాష్ట్రంలో పలువురు ఐఏఎస్ అధికారుల బదిలీ - transfers in andhrapradhesh
22:16 October 01
బదిలీలు, నియామకాల ఉత్తర్వులు జారీ చేసిన సీఎస్ సమీర్ శర్మ
రాష్ట్రంలో కొందరు ఐఏఎస్ అధికారులను బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. పంచాయితీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ కమిషనర్ గా పనిచేస్తున్న గిరిజా శంకర్ ను పౌర సరఫరాల శాఖ కమిషనరుగా బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. పౌరసరఫరాల శాఖ నుంచి పంచాయతీ రాజ్ కమిషనరుగా కోన శశిధర్ ను బదిలీ చేశారు. అలాగే ప్రస్తుతం పరిహారం, పునరావాస కమిషనర్ గా పనిచేస్తున్న హరి జవహర్ లాల్ ను దేవాదాయశాఖ కమిషనర్ గా బదిలీ చేశారు. దేవాదాయశాఖ కమిషనర్ గా పూర్తి అదనపు బాధ్యతల నుంచి ఆ శాఖ కార్యదర్శి వాణి మోహన్ ను రిలీవ్ చేశారు. ఇక పోస్టింగ్ కోసం ఎదురు చూస్తున్న నవీన్ కుమార్ కు వైద్యారోగ్య శాఖ ప్రత్యేక కార్యదర్శి గా బాధ్యతలు అప్పగించారు. వైద్యారోగ్యశాఖ లో కంప్యూటర్ డాటా విశ్లేషణతో పాటు ఇతర అంశాలను నవీన్ కుమార్ పర్యవేక్షిస్తారని ప్రభుత్వం పేర్కోంది. మరోవైపు సహాయ పునరావాస కమిషనర్ గా జలవనరుల శాఖ కార్యదర్శి శ్యామలరావుకు పూర్తి అదనపు బాధ్యతలు అప్పగించారు. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమీర్ శర్మ ఉత్తర్వులు జారీ చేశారు.
ఇదీచదవండి.