కరోనా బాధితులకు మెరుగైన చికిత్స నిమిత్తం... క్వారంటైన్, కొవిడ్ కంట్రోల్ కేంద్రాల్లో సౌకర్యాలపై ప్రభుత్వం చర్యలు చేపట్టింది. పర్యవేక్షణ బాధ్యతలను సీనియర్ ఐఏఎస్‌లు ఆర్జా శ్రీకాంత్, కన్నబాబుకు అప్పగిస్తూ ఆదేశాలు జారీ చేసింది. అన్ని కేంద్రాల్లో వైద్యేతర వసతులపై నిరంతరం పర్యవేక్షించాలని ఆదేశించింది.
ఇతర రాష్ట్రాల ప్రయాణికుల వివరాల నమోదు, పర్యవేక్షణ చేయాలని పేర్కొంది. స్పందన అనుమతులు, గ్రామ, వార్డు స్థాయిలో వైద్యసేవలు పర్యవేక్షించాలని సూచించింది. వైద్యశాఖ అధికారులతో సమన్వయం చేసుకుని సమస్యలు పరిష్కరించాలని ఆదేశాల్లో దిశానిర్దేశం చేసింది.