ఆంధ్రప్రదేశ్

andhra pradesh

సింహాచలం, శ్రీశైలం ఈవోలుగా ఐఏఎస్‌లు?

By

Published : Jun 8, 2020, 6:31 AM IST

సింహాచలం, శ్రీశైలం ఆలయాలకు కార్యనిర్వాహక అధికారులు (ఈవో)గా ఐఏఎస్‌లను నియమించాలని ప్రభుత్వం భావిస్తోంది.ఇప్పటికే ఓ ప్రతిపాదన సిద్ధమైనట్లు తెలిసింది. త్వరలో నిర్ణయం తీసుకునే వీలుందని దేవాదాయశాఖ వర్గాల సమాచారం.

simhachalam
simhachalam

సింహాచలం, శ్రీశైలం ఆలయాలకు కార్యనిర్వాహక అధికారులు (ఈవో)గా ఐఏఎస్‌లను నియమించాలని ప్రభుత్వం భావిస్తోంది. రెండు ఆలయాలకు భక్తుల రద్దీ ఎక్కువ. సింహాచలం ఆలయానికి కోట్లాది రూపాయల విలువైన భూములు ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఈ రెండు ఆలయాలకు ఐఏఎస్‌ అధికారుల నియామకాన్ని ప్రభుత్వం పరిశీలిస్తోంది. ఇప్పటికే ఓ ప్రతిపాదన సిద్ధమైనట్లు తెలిసింది. త్వరలో నిర్ణయం తీసుకునే వీలుందని దేవాదాయశాఖ వర్గాల సమాచారం.


సింహాచలం ఆలయ ప్రస్తుత ఈవో వెంకటేశ్వరరావుపై బదిలీ వేటు పడనున్నట్లు తెలిసింది. ఆలయ ఘాట్‌ రోడ్‌ నిర్మాణానికి సంబంధించి గ్రావెల్‌ తరలించడం, ఉన్నతాధికారుల అనుమతి లేకుండా కొన్ని నిర్ణయాలు తీసుకోవడం, చందనోత్సవానికి బయటి వ్యక్తి రావడం, పంచ గ్రామాల్లో కొత్తగా నిర్మాణాలు తదితరాలపై కొద్దిరోజుల కిందట విచారణ జరిగింది. ఆయనపై చర్యలు తీసుకోవాలంటూ విచారణ అధికారి ప్రభుత్వానికి నివేదిక అందించారు. ఈ నేపథ్యంలో ఈవోను బదిలీ చేస్తారని తెలిసింది. ఒకటి, రెండు రోజుల్లో ఉత్తర్వులు వెలువడే అవకాశం ఉంది.

ABOUT THE AUTHOR

...view details