'భారత సైనికుల్లో ఉన్న దేశభక్తి, ఆత్మవిశ్వాసం వల్లే కార్గిల్ విజయం'
భౌగోళిక ప్రతికూలతల కారణంగా కార్గిల్ యుద్ధంలో కీలకమైన ప్రాంతాలను తిరిగి స్వాధీనం చేసుకోవడంలో భారత్ చాలా శ్రమించాల్సి వచ్చిందని వైమానికదళ మాజీ అధికారి కాటూరి రవీంద్ర త్రివిక్రమ్ అన్నారు. అన్ని ప్రతికూలతలు ఉన్నప్పటికీ భారత సైనికుల్లో ఉన్న దేశభక్తి, ఆత్మవిశ్వాసం కార్గిల్ యుద్ధంలో గెలిపించాయని తెలిపారు.
కార్గిల్ విషయంలో ఆలస్యంగా చర్యలు చేపట్టినందువల్ల భారత్ తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొన్నట్లు వైమానికదళ మాజీ అధికారి కాటూరి రవీంద్ర త్రివిక్రమ్ అన్నారు. చాలా మంది ప్రాణాలు అర్పించాల్సి వచ్చిందన్నారు. భౌగోళిక ప్రతికూలతల కారణంగా కార్గిల్ యుద్ధంలో కీలకమైన ప్రాంతాలను తిరిగి స్వాధీనం చేసుకోవడంలో చాలా శ్రమించాల్సి వచ్చిందన్నారు. అయినప్పటికీ భారత్ సైనికుల్లో ఆత్మస్థైర్యం, దేశభక్తి చాలా ఎక్కువని అవే మన విజయానికి కారణన్నారు. ప్రజలందరూ దేశ భక్తిని కలిగి ఉండాలని... దేశానికి ఆపద పస్తే అందరూ అండగా నిలబడాలన్నారు. మన మధ్యే తిరుగుతూ దేశానికి ద్రోహం చేసే వారిని ఏరిపారేయాలని త్రివిక్రమ్ అన్నారు. మన వారి త్యాగాల స్మరణే 'కార్గిల్ విజయ్ దివస్' అని పేర్కొన్నారు.