14 దేశాలతో ప్రతినిధులతో సీఎం జగన్ ముఖాముఖి - I will take care of the permissions' .. CM jagan with foreign representatives
డిప్లమటెక్ ఔట్ రీచ్ సదస్సులో 14 దేశాల ప్రతినిధులతో సీఎం జగన్ ముఖాముఖి అయ్యారు. రాష్ట్రంలో పెట్టుబడులకు సింగిల్ విండో పద్ధతిలో అనుమతులు మంజూరు చేస్తామని స్పష్టం చేశారు. సీఎం కార్యాలయమే అనుమతులు విషయం దగ్గరుండి చూస్తుందని తెలిపారు.
![14 దేశాలతో ప్రతినిధులతో సీఎం జగన్ ముఖాముఖి](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-4092143-1016-4092143-1565372502064.jpg)
14 దేశాలతో ప్రతినిధులతో సీఎం జగన్ ముఖాముఖి
అమరావతి వేదికగా జరుగుతున్న డిప్లమటెక్ ఔట్ రీచ్ సదస్సులో 14 దేశాల ప్రతినిధులతో సీఎం ముఖాముఖి అయ్యారు. దక్షిణకొరియా, సింగపూర్, పోలాండ్, బల్గేరియా, శ్రీలంక, ఆస్ట్రియా, యూకే, మయన్మార్ ప్రతినిధులతో సమావేశమయ్యారు. ఒక్క దరఖాస్తు చేస్తే అనుమతులన్నీ తానే చూసుకుంటానని సీఎం హామీనిచ్చారు. పెట్టుబడుల అనుమతులను సీఎం కార్యాలయమే అన్నీ దగ్గరుండి చూస్తుందని తెలిపారు. సింగిల్ విండో పద్ధతిలో అనుమతులు మంజూరు చేస్తామని స్పష్టం చేశారు. ఏ సమస్య వచ్చినా వెంటనే పరిష్కరిస్తామని అన్నారు.