హైదరాబాద్‌లో టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి(revanth reddy)ని.. భాజపా నేతలు ధర్మపురి సంజయ్, మాజీ ఎమ్మెల్యే ఎర్రశేఖర్, గండ్ర సత్యనారాయణ రావు కలిశారు. రేవంత్‌రెడ్డికి అభినందనలు తెలిపారు. తాము కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నట్లు ప్రకటించారు. త్వరలోనే దిల్లీలో అధిష్ఠానం సమక్షంలో కాంగ్రెస్ కండువా కప్పుకోనున్నట్లు తెలిపారు.
తెరాస(trs) కండువా గొడ్డలిలాంటిదని ధర్మపురి సంజయ్ అన్నారు. తన తండ్రి డీఎస్ కోసమే గులాబీ పార్టీలో చేరినట్లు తెలిపారు. కాంగ్రెస్‌లో పుట్టి పెరిగానన్న సంజయ్... కొన్ని కారణాలతో పార్టీ మారానని తెలిపారు. రేవంత్ నాయకత్వం బలపరిచేందుకు మళ్లీ కాంగ్రెస్ తీర్థం పుచ్చుకోనున్నట్లు స్పష్టం చేశారు. త్వరలో దిల్లీ వెళ్లి పెద్దల సమక్షంలో చేరతానని ప్రకటించారు.
మరోవైపు జడ్చర్ల మాజీ ఎమ్మెల్యే, మహబూబ్‌నగర్ జిల్లా భాజపా అధ్యక్షుడు ఎర్ర శేఖర్ ఆ పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్‌లో చేరనున్నట్లు తెలిపారు.