గత ప్రభుత్వం దిల్లీలోని ఏపీ భవన్లో 'ఐ లవ్ అమరావతి' చిహ్నాన్ని ఏర్పాటు చేసింది. సందర్శకులకు ఇదో సెల్ఫీ పాయింట్‌గా మారి.. ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఇటీవల గణతంత్ర వేడుకల అనంతరం అధికారుల ఆదేశంతో 'ఐ లవ్ అమరావతి' చిహ్నాన్ని సిబ్బంది పక్కన పెట్టారు. మరమ్మతుల కోసం దాన్ని తొలగించినట్లు భవన్ రెసిడెంట్ కమిషనర్ భావనా సక్సేనా తెలిపారు. ఆ మరుసటి రోజు ఏ అక్షరం ఒక్కదానితోనే చిహ్నాన్ని ఏర్పాటు చేశారు. బుధవారం దానికి 'పి' అక్షరాన్ని చేర్చి 'ఐ లవ్ ఏపీ'గా మార్చేశారు.
అమరావతి పోయి.. ఏపీ వచ్చే.. - ఐ లవ్ ఏపీ న్యూస్
గత ప్రభుత్వం దిల్లీలోని ఏపీ భవన్లో 'ఐ లవ్ అమరావతి' చిహ్నాన్ని ఏర్పాటు చేసింది. ఇప్పుడు అది 'ఐ లవ్ ఏపీ'గా మారింది.
i love amaravathi become i love ap