Government Employee Innovative Presentation: తెలంగాణ సూర్యాపేట జిల్లా పాలకీడు మండలం ఆసక్తికర సంఘటన జరిగింది. తహశీల్దార్ కార్యాలయంలో ఎఆర్ఐగా విధులు నిర్వహించే చిలకరాజు నర్సయ్య అనే ఉద్యోగి "నాకు లంచం వద్దు" అని రాసి ఉన్న కార్డును ధరించి విధులకు హజరయ్యారు. దీంతో ఒక్కసారిగా అందరూ ఆశ్చర్యానికి గురయ్యారు. అటెండర్‌గా ఉద్యోగం ప్రారంభించిన నేను ఇప్పుడు ఎఆర్ఐగా పదోన్నతి పొందానని తనకు ఇది చాలా సంతృప్తిగా ఉందని నర్సయ్య తెలిపారు. లంచం తీసుకోకూడదు అనే నిర్ణయం సొంతంగా తీసుకుందని పేర్కొన్నారు. ఈ నిర‌్ణయాన్ని సాటి ఉద్యోగులు స్వాగతించాలని ఆయన కోరారు.
నేను అటెండర్‌గా ఉద్యోగం ప్రారంభించాను.. నాకు లంచం వద్దు - I Dont Want Bribe
Government Employee Innovative Presentation: ఏ ప్రభుత్వ శాఖ చూసిన ఏం ఉంది గర్వకారణం.. అన్ని ప్రభుత్వ శాఖలు అవినీతి మయం అని ప్రజల్లో బలంగా నాటుకు పోయిన మాట. అందులో రెవెన్యూ శాఖ మాటకి వస్తే ఇది ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. టేబుల్ కింద చేయి తడవినిదే పని కాని పరిస్థితి అలా ఉన్నారు కొందరు ప్రభుత్వ ఉద్యోగస్థులు. కానీ ఇక్కడున్న ఈ ప్రభుత్వ ఉద్యోగి మాత్రం అందుకు విభిన్నంగా "నాకు లంచం వద్దు" అని తన మెడలో ఓ కార్డు పెట్టుకొని వినూత్నంగా తన భావాన్ని వ్యక్తీకరిస్తున్నాడు. అతను ఏంటో అతని మాటలు ఏంటో ఇప్పుడు చూద్దాం.
bribe
"ఈరోజు మాకుటుంబ సభ్యుల అనుమతి, వారి ప్రోత్సహంతో ఈ నిర్ణయం తీసుకున్న.. అటెండర్‌గా ఉద్యోగం ప్రారంభించి ఇప్పుడు ఎఆర్ఐగా పదోన్నతి పొందాను. నాకు ఇది చాలా సంతృప్తిగా ఉంది. లంచం తీసుకోకూడదు అనే నిర్ణయం సొంతంగా తీసుకుంది. ఈ నిర‌్ణయాన్ని సాటి ఉద్యోగులు స్వాగతించాలని కోరుకుంటున్నాను. నేను ఇలా కార్డుపై ప్రదర్శించి రెండో రోజు. నా జీవితాంతం ఇలానే ఆఫీస్‌కి వస్తానని నిర్ణయించుకున్నా."-చిలకరాజు నర్సయ్య, ఎఆర్ఐ పాలకీడు
ఇవీ చదవండి: