ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

పార్టీ మారిన ఎమ్మెల్యేలు ఎవరో నాకు తెలియదు: ఎంపీ విజయసాయి - వైకాపా ఎంపీలు తాజా వార్తలు

దిల్లీలో వైకాపా ఎంపీలు ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఓ విలేకరి అడిగిన ప్రశ్నకు ఎంపీ విజయసాయి రెడ్డి సమాధానం దాట వేశారు. ఆ ప్రశ్న పూర్తిగా అసంబద్ధమని అన్నారు.

vijaya sai reddy
vijaya sai reddy

By

Published : Jul 3, 2020, 5:50 PM IST

మీడియా సమావేశంలో ఎంపీ విజయసాయి రెడ్డి

స్వపక్షంలో విపక్షంలా ఎంపీ రఘురామకృష్ణరాజు ప్రవర్తిస్తున్నందునే ఆయనపై అనర్హత వేటు వేయాలని స్పీకర్‌కు ఫిర్యాదు చేసినట్లు వైకాపా ఎంపీలు తెలిపారు. పార్లమెంట్​లో స్పీకర్​ ఓం బిర్లాను కలిసిన అనంతరం వారు మీడియాతో మాట్లాడారు. రఘురామకృష్ణరాజు పార్టీ వ్యతిరేక చర్యలకు పాల్పడ్డారని విజయసాయిరెడ్డి విమర్శించారు. ఏ పార్టీ తరఫున ఎంపీగా ఉన్నారో ఆ పార్టీపైనే ఆరోపణలు చేయడం సముచితం కాదన్నారు. అయితే ఈ నిబంధనలు వైకాపా ఎంపీకేనా తెదేపా రెబల్ ఎమ్మెల్యేలకు వర్తించవా అంటూ ఓ విలేకరి అడిగిన ప్రశ్నకు విజయసాయి రెడ్డి సమాధానం దాట వేశారు.

'మీరు చెప్పే ఎమ్మెల్యేలు ఎవరో నాకు తెలియదు. మీ ప్రశ్న పూర్తిగా అసంబద్ధం. మా పార్టీలో వారు చేరలేదు. ఏ పార్టీ నుంచి మారారని అంటున్నారో ఆ పార్టీ అధ్యక్షుడిని ఈ ప్రశ్న అడగండి' అని విజయసాయి రెడ్డి సమాధానం ఇచ్చారు.

ABOUT THE AUTHOR

...view details