'అరెస్ట్ కారణంగా కోర్టుకు హాజరుకాలేకపోతున్నాను' - 'I am unable to attend court due to arrest'-nimmagadda prasad informed to court
సెర్బియాలో అరెస్ట్ కారణంగా తాను భారత్కి తిరిగి రాలేకపోయినట్లు పారిశ్రామికవేత్త నిమ్మగడ్డ ప్రసాద్ సీబీఐ ప్రత్యేక కోర్టుకు సమాచారం ఇచ్చారు. ఈ మేరకు ఆయన తరపు న్యాయవాది కోర్టులో మెమో దాఖలు చేశారు.
!['అరెస్ట్ కారణంగా కోర్టుకు హాజరుకాలేకపోతున్నాను'](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-4022951-142-4022951-1564757734613.jpg)
సెర్బియాలో అరెస్టయినందున భారత్‌కు తిరిగి రాలేకపోయినట్లు పారిశ్రామికవేత్త నిమ్మగడ్డ ప్రసాద్ సీబీఐ ప్రత్యేక న్యాయస్థానానికి సమాచారం ఇచ్చారు. నిమ్మగడ్డ తరఫున ఆయన న్యాయవాది సీబీఐ కోర్టులో మెమో దాఖలు చేశారు. గతంలో జగన్ అక్రమాస్తుల కేసులో భాగంగా వాన్‌పిక్ వ్యవహారంలో హైదరాబాద్‌లో అరెస్టయిన నిమ్మగడ్డ ప్రసాద్.. షరతులతో కూడిన బెయిల్‌పై ఉన్నారు. సెర్బియాకు వెళ్లేందుకు ఆయన... సీబీఐ కోర్టు అనుమతి పొందారు. సీబీఐ న్యాయస్థానం ఇచ్చిన గడువు నేటితో ముగిసింది. దీనితో సెర్బియాలో అరెస్టయినందున స్వదేశానికి తిరిగి రాలేకపోయినట్లు మెమోలో పేర్కొన్నారు. దర్యాప్తు సంస్థకూ సమాచారం ఇచ్చినట్లు తెలిపారు. రస్ అల్ ఖైమా ఇచ్చిన ఫిర్యాదు మేరకు అబుదాబీ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.