ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

తెలంగాణ: రాగల మూడు రోజుల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు! - తెలంగాణ లేటెస్ట్ అప్డేట్స్

రాగల మూడు రోజుల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. తెలంగాణలోని పలు జిల్లాల్లో అక్కడక్కడ ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం పడనుందని ప్రకటించింది.

hyderabad weather report
తెలంగాణ: రాగల మూడు రోజుల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు!

By

Published : Mar 19, 2021, 3:57 PM IST

తెలంగాణ రాష్ట్రంలో రాగల మూడు రోజుల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం ప్రకటించింది. ఆదిలాబాద్‌, కుమురంభీం ఆసిఫాబాద్, నిర్మల్‌, మంచిర్యాల, నిజామాబాద్‌, జగిత్యాల, కరీంనగర్‌ జిల్లాల్లో అక్కడక్కడ ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురిసే అవకాశం ఉందని తెలిపింది.

విదర్భ, దాని పరిసర ప్రాంతాల్లో శుక్రవారం 1.5కిలో మీటర్ల ఎత్తు వరకు ఉపరితల ఆవర్తనం విస్తరించి ఉన్నట్లు పేర్కొంది.

ABOUT THE AUTHOR

...view details