హైదరాబాద్ నుంచి రాష్ట్రానికి ప్రత్యేక బస్సులు వాయిదా - undefined
హైదరాబాద్‌లోని ఏపీ వాసుల తరలింపు కోసం ఏర్పాటు చేసిన ప్రత్యేక బస్సులను ఆర్టీసీ వాయిదా వేసింది. బస్సులు తిరిగి ఎప్పుడు నడిపేది తర్వాత ప్రకటిస్తామని అధికారులు తెలిపారు.
బస్సుల ఏర్పాటు వాయిదా
హైదరాబాద్ నుంచి ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక బస్సుల ఏర్పాటు వాయిదా పడింది. రేపటి నుంచి ప్రత్యేక బస్సులు నడపాలని ముందుగా ఏపీఎస్ ఆర్టీసీ నిర్ణయించింది. రేపట్నుంచి బస్సులు నడపడాన్ని వాయిదా వేస్తున్నట్లు ఏపీఎస్ ఆర్టీసీ తెలిపింది. బస్సులు ఎప్పటి నుంచి నడుపుతామనే విషయాన్ని తర్వాత చెబుతామని పేర్కొంది.