తెలంగాణలోని మేడ్చల్ జిల్లా కొంపల్లిలోని ఏఎమ్ఆర్ గార్డెన్స్‌లో 75వ స్వాతంత్య్ర దినోత్సవాల సందర్భంగా.. అవని నృత్యలయా ఆధ్వర్యంలో జుంబా డాన్స్ ప్రదర్శన నిర్వహించారు. 75 పాటలతో 75 మంది కళాకారులు 75 నిమిషాల పాటు ఆగకుండా నృత్యం వేశారు.
ఈ నృత్యాన్ని వీక్షించిన భారత్ వరల్డ్ రికార్డ్స్ సభ్యులు.. కళాకారులను అభినందించారు. పది ప్రపంచ రికార్డుల్లో ఈ నృత్యాన్ని నమోదు చేస్తున్నట్లు భారత్ వరల్డ్ రికార్డ్ ప్రెసిడెంట్ రమణ ప్రకటించారు.