హైసియా (హైదరాబాద్ సాఫ్ట్‌వేర్ ఎంటర్‌ప్రైజెస్ అసోసియేషన్) ఆధ్వర్యంలో ‘కృత్రిమ మేధ విద్య, ఉద్యోగావకాశాలు’ అనే అంశంపై వెబినార్ నిర్వహిస్తున్నారు. విద్యార్థులు, ఉద్యోగాల వేటలో ఉన్నవారు, ఐటీ నిపుణులు, అంకుర సంస్థల వ్యవస్థాపకులు- ఉద్యోగులు తదితర వర్గాల వారికి ఇది ఎంతో ఆసక్తికరమైన అంశం. ఈ రంగంలో ఏం జరుగుతోంది? కొత్తగా వస్తున్న మార్పులకు అనుగుణంగా ఎలా సన్నద్ధం కావాలి అనే అంశాలను ఈ వెబినార్‌లో వివరించనున్నారు.
కృత్రిమ మేథ, ఉద్యోగావకాశాలపై అక్టోబర్ 9న వెబినార్ - హైసియా వెబినార్ వార్తలు
కృత్రిమ మేధ విద్య, ఉద్యోగావకాశాలు అనే అంశంపై హైసియా ఆధ్వర్యంలో.. అక్టోబర్ 9వ తేదీన వెబినార్ నిర్వహించనున్నారు. ఈ రంగంలో కొత్తగా వస్తున్న మార్పులకు అనుగుణంగా ఎలా సన్నద్ధం కావాలి అనే అంశాలను వక్తలు వివరించనున్నారు.
ఈ కార్యక్రమం అక్టోబర్ 9వ తేదీన... ఉదయం 11 గంటలకు ప్రారంభం కానుంది. వెబినార్‌లో తెలంగాణ ఐటీ సెక్రటరీ జయేశ్ రంజన్, హైసియా అధ్యక్షుడు భరణి కుమార్ అరోల్, హైసియా ఫౌండర్ జీఆర్ రెడ్డి, ఐఐఐటీ ప్రొఫెసర్ రమేశ్ లోగనాథన్ వక్తలుగా పాల్గొననున్నారు. ఇన్సైడ్ వ్యూ టెక్నాలజీస్ ఇంక్ బోర్డు మెంబర్ శేషారావు సమన్వయకర్తగా వ్యవహరించనున్నారు. సీట్ల సంఖ్య పరిమితం కావడంతో త్వరగా రిజిస్టర్ చేసుకోవాలని హైసియా సభ్యులు సూచించారు. వెబినార్‌లో పాల్గొనాలనుకునే వారు రిజిస్ట్రేషన్ కోసం ఇక్కడ క్లిక్ చేసి వివరాలు నమోదు చేసుకోండి.
ఇదీ చదవండి: