ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

తెలంగాణ: పరిధి దాటితే.. పట్టేస్తారు!

లాక్‌డౌన్‌ సమయంలో ట్రాఫిక్‌ ఉల్లంఘనులపై తెలంగాణ సైబరాబాద్‌, రాచకొండ పోలీసులు కఠిన చర్యలు తీసుకుంటున్నారు. నిబంధనలు ఉల్లంఘించినందుకు ట్రాఫిక్‌ పోలీసులు కేసులు నమోదు చేశారు. ఈ కేసులు సాధారణ రోజులతో పోలిస్తే రోజుకు మూడువేలు అధికంగా ఉన్నాయి.

hyderabad police strict action agaist lock down
లాక్​డౌన్​పై హైదరాబాద్​ పోలీసుల కఠిన చర్యలు

By

Published : Apr 24, 2020, 11:35 AM IST

లాక్​డౌన్​ నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని తెలంగాణ పోలీసులు హెచ్చరిస్తున్నారు. మార్చి 23నుంచి ఏప్రిల్‌ 22 వరకు 6.26 లక్షల కేసులు నమోదు చేశారు. ఒక్క సైబరాబాద్‌ కమిషనరేట్‌లోనే 5.4 లక్షల కేసులు నమోదుకాగా అధికంగా శిరస్త్రాణ ఉల్లంఘనలే. వెనుక కూర్చున్న వ్యక్తి శిరస్త్రాణం ధరించకపోవడంతో 1.26 లక్షల కేసులుపెట్టారు. సైడ్‌ అద్దాలు లేకపోవడంతో 47వేల వాహనాలకు జరిమానా విధించారు. సీజ్‌చేసిన వాహనాలను లాక్‌డౌన్‌ తర్వాత అప్పగిస్తామని పోలీసులు తేల్చి చెబుతున్నారు.

నెలలో కొత్త రికార్డులు
నిబంధనలు ఉల్లంఘించినందుకు ‘లాక్‌డౌన్‌ ’మాసంలో ట్రాఫిక్‌ పోలీసులు నమోదు చేసిన కేసులు సాధారణ రోజులతో పోలిస్తే రోజుకు మూడువేలు ఎక్కువ. పోలీసులకు సహకరించకపోవడం, ఎస్సైలు, సిబ్బందిపై దాడికి దిగిన వాహనదారులపై ఐపీసీ సెక్షన్ల కింద కేసులు నమోదు చేసి వాహనాలను స్వాధీనం చేసుకుంటున్నారు.

తాజా కేసులు ఇవి..
గురువారం లాక్‌డౌన్‌ నిబంధనలు ఉల్లంఘించిన 13,311 మందిపై కేసులు నమోదు చేసినట్లు అదనపు సీపీ అనిల్‌కుమార్‌ తెలిపారు.

నంబర్‌ ప్లేట్‌ రీడింగ్‌ కెమెరాల వినియోగం
లాక్‌డౌన్‌ నిబంధనలు పట్టించుకోకుండా రోడ్లమీదకు వస్తున్న వారిపై నిఘా పెట్టేందుకు గ్రేటర్‌లో ఆటోమేటిక్‌ నంబర్‌ ప్లేట్‌ రీడింగ్‌ కెమెరాలను వినియోగిస్తున్నారు. మూడు కమిషనరేట్ల పరిధిలో 300 కూడళ్లలో 500 ఆటోమేటిక్‌ నంబర్‌ ప్లేట్‌ రీడింగ్‌ కెమెరాలను కొన్నాళ్ల కిందటే ఏర్పాటు చేశారు. వీటితో వాహనదారుడు ఎంత వేగంగా వెళ్తున్నాడో కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్లలో ఉన్న పోలీసులు తెలుసుకునే అవకాశం ఉంది. వీటికే వాహనదారుడు మూడు కిలో మీటర్ల పరిధి దాటితే అప్రమత్తం చేసే సాఫ్ట్‌వేర్‌ లోడ్‌ చేశారు. ఇది విజయవంతం కావడంతో వాహనదారుడు దొరికితే కేసులు, లేకపోతే ఆన్‌లైన్‌లో చలానాను ఇంటికి పంపిస్తున్నారు. సైబరాబాద్‌ పోలీసు కమిషనరేట్‌ పరిధిలో 4.20 లక్షలు, హైదరాబాద్‌లో 2.94 లక్షలు, రాచకొండలో 59 వేల మందిపై కేసులు నమోదయ్యాయి. హైదరాబాద్‌ పోలీసు కమిషనరేట్‌లోనే 30 వేల వాహనాలను స్వాధీనం చేసుకున్నారు.

ఇవీచూడండి:రెడ్​జోన్ ప్రాంతాలపై నిఘా కోసం మరో యాప్: డీజీపీ

ABOUT THE AUTHOR

...view details