ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

తెలంగాణ: రాజ్​​భవన్ ముట్టడికి పిలుపుతో.. కాంగ్రెస్ శ్రేణుల అరెస్టులు - తెలంగాణ వార్తలు

రాజ్​భవన్ ఘెరావ్ కార్యక్రమానికి కాంగ్రెస్ పార్టీ పిలుపునిచ్చిన నేపథ్యంలో కాంగ్రెస్ శ్రేణుల అరెస్టుల పరంపర కొనసాగుతోంది. సెక్రటేరియట్ గేటు ముందు భారీగా మోహరించిన పోలీసులు... వందలాది మంది నాయకులు, కార్యకర్తలను అరెస్ట్ చేశారు. ముఖ్య నేతలను సైఫాబాద్ పోలీస్ స్టేషన్​కు తరలించారు.

congress leaders arrest
కాంగ్రెస్ శ్రేణుల అరెస్టులు

By

Published : Jan 19, 2021, 5:09 PM IST

తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ తలపెట్టిన రాజ్​భవన్ ఘోరావ్ నేపథ్యంను పోలీసులు ఎక్కడికక్కడ అడ్డుకుంటున్నారు. ఏఐసీసీ పిలుపుతో కేంద్రం తెచ్చిన సాగు చట్టాలకు వ్యతిరేకంగా దిల్లీ శివార్లలో ఉద్యమం చేస్తున్న రైతులకు మద్దతుగా ఈ కార్యక్రమం చేపట్టారు. లుంబినీ పార్కు నుంచి రాజ్​భవన్‌ వరకు ర్యాలీగా వెళుతున్న కాంగ్రెస్ పార్టీ నాయకులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, రేవంత్ రెడ్డి, కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి, షబ్బీర్ అలీ, అంజన్ కుమార్ యాదవ్ పలువురు నేతలను పోలీసులు అడ్డుకొని... అరెస్ట్ చేశారు.

కాంగ్రెస్ శ్రేణుల అరెస్టులు

సెక్రటేరియట్ వద్దకు రాగానే.. పోలీసులు... నాయకులు, కార్యకర్తలను అరెస్ట్ చేశారు. పీసీసీ మాజీ అధ్యక్షుడు వి.హనుమంత రావు, ఓబీసీ సెల్ ఛైర్మన్ కత్తి వెంకట స్వామి, ఆదివాసీ కాంగ్రెస్ జాతీయ నాయకులు బెల్లయ్య నాయక్​లు అరెస్టైన వారిలో ఉన్నారు. పీసీసీ మాజీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, ఏఐసీసీ కార్యదర్శులు బోసు రాజు, శ్రీనివాస్ కృష్ణన్, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి, ఎమ్మెల్యే జగ్గారెడ్డి, ఫిరోజ్ ఖాన్, యూత్ జాతీయ ప్రధాన కార్యదర్శి అనిల్ కుమార్ యాదవ్ తదితరులను అరెస్ట్ చేసి సైఫాబాద్ పోలీస్ స్టేషన్​కు తరలించారు.

కాంగ్రెస్ శ్రేణుల అరెస్టులు

కేంద్రం తెచ్చిన సాగు చట్టాలను రద్దు చేయాలని... పెరుగుతున్న పెట్రోల్, డీజిల్, నిత్యావసర సరుకుల ధరలను తగ్గించాలని కాంగ్రెస్ నేతలు డిమాండ్ చేశారు. రాజ్‌భవన్‌ వరకు ర్యాలీకి ఎలాంటి అనుమతులు లేవని అందువల్లే నేతలను అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలపారు.

ఇదీ చదవండి:ఇన్​సైడర్ ట్రేడింగ్​ కేసులు కొట్టివేసిన హైకోర్టు

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details