హైదరాబాద్ మెట్రో ప్రయాణికులకు శుభవార్త తెలిపింది. పండుగల సీజన్‌ను పురస్కరించుకుని ప్రయాణికుల కోసం 'మెట్రో సువర్ణ ఆఫర్ 2021'ను ప్రకటించింది. 20ట్రిప్పుల ధరతో 30 ట్రిప్పులు ప్రయాణించే అవకాశాన్ని హైదరాబాద్ మెట్రో కలిగించింది. ఈ ఆఫర్ కాలంలో గరిష్టంగా 15రూపాయలు చెల్లించి గ్రీన్‌లైన్‌పై ఎక్కడికైనా ప్రయాణించవచ్చునని ఎల్ అండ్ టీ సంస్థ పేర్కొంది. నెలలో 20ట్రిప్పులు, ఆ పైన అధికంగా ప్రయాణించే ప్రయాణికుల కోసం ప్రతీ నెల లక్కీ డ్రా ఏర్పాటు చేశామని ఎల్ అండ్ టీ ఎంఆర్‌హెచ్‌ఎల్ సీఈవో కేవీబీ రెడ్డి వెల్లడించారు. ఈ ట్రిప్పులను 45రోజులలోపు వినియోగించుకోవాల్సి ఉంటుందన్నారు. ఈ ఆఫర్ కేవలం మెట్రో స్మార్ట్ కార్డ్ (పాత, నూతనం)పై మాత్రమే వర్తిస్తుందని వెల్లడించారు.
METRO: హైదరాబాద్ మెట్రో 'సువర్ణ ఆఫర్ 2021' - telangana varthalu
పండుగల సీజన్‌ను పురస్కరించుకుని ప్రయాణికుల కోసం హైదరాబాద్ మెట్రో 'సువర్ణ ఆఫర్ 2021'ను ప్రకటించింది. నెలలో 20ట్రిప్పులు, ఆపై అధికంగా ప్రయాణించే ప్రయాణికుల కోసం ప్రతీ నెల లక్కీ డ్రా ఏర్పాటు చేశామని ఎల్ అండ్ టీ ఎంఆర్‌హెచ్‌ఎల్ సీఈవో కేవీబీ రెడ్డి వెల్లడించారు.
మెట్రో ప్రయాణికులు ఈ ఆఫర్‌ను 18 అక్టోబర్, 2021 నుంచి 15 జనవరి, 2022 మధ్య వినియోగించుకోవాల్సి ఉంటుందని కేవీబీ రెడ్డి వివరించారు. మరిన్ని వివరాల కోసం సమీపంలోని మెట్రో స్టేషన్‌లను సంప్రదించాలని సూచించారు. ప్రయాణికుల కోసం నూతన ఆఫర్లతో మెట్రో సువర్ణ ఆఫర్‌ను తిరిగి పరిచయం చేస్తుండటం పట్ల సంతోషంగా ఉందని ఎండీ ఎన్వీఎస్ రెడ్డి తెలిపారు. అత్యంత సురక్షితమైన ప్రయాణ అవకాశాలను అందిస్తూనే.. ప్రయాణికుల నగదుకు తగ్గ విలువను అందించాలనే ఉద్దేశమే ఈ 'మెట్రో సువర్ణ ఆఫర్' అని పేర్కొన్నారు.
ఇదీ చదవండి: South Central Railway: దసరాకు ఊరెళ్తున్నారా? ప్రత్యేక రైళ్ల వివరాలివే..