ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

హైదరాబాద్ మెట్రో: రేపే జేబీఎస్ - ఎంజీబీఎస్ మార్గం ప్రారంభం

భాగ్యనగర మణిహారం రేపటి నుంచి పూర్తిస్థాయిలో అందుబాటులోకి రానుంది. శుక్రవారం సాయంత్రం తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్​.. హైదరాబాద్ మెట్రోలో మరో కీలక మార్గాన్ని లాంఛనంగా ప్రారంభించనున్నారు. మొత్తం మూడు కారిడార్లలో 69 కిలోమీటర్ల మేర మెట్రో.. హైదరాబాద్ ప్రజలకు అందుబాటులోకి రానుంది.

hyderabad-metro
hyderabad-metro

By

Published : Feb 6, 2020, 8:15 PM IST

రేపే జేబీఎస్ - ఎంజీబీఎస్ మార్గం ప్రారంభం

తెలంగాణలోని హైదరాబాద్ మహానగరానికి మణిహారంగా మారిన మెట్రో రైలు ప్రాజెక్టులో మరో కీలక మార్గం... రేపటి నుంచి అందుబాటులోకి రానుంది. నగరంలోని ప్రధాన బస్టాండ్లు అయిన జేబీఎస్, ఎంజీబీఎస్​ను అనుసంధానం చేస్తూ 11 కిలోమీటర్ల పొడవునా మెట్రో మార్గాన్ని నిర్మించారు. శుక్రవారం సాయంత్రం ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ లాంఛనంగా ప్రారంభించనున్నారు. మొత్తం 69 కిలోమీటర్లు మెట్రో మార్గం ప్రయాణికులకు అందుబాటులోకి రానుంది.

2012లో రూ.14 వేల 132 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టిన ప్రాజెక్టు 2017 జులై నాటికే పూర్తి కావాల్సి ఉంది. ఆస్తుల సేకరణ, కోర్టు కేసులు, అలైన్ మెంట్ వివాదాలతో జాప్యం జరిగింది. వాటన్నింటిని అధిగమించి మూడేళ్లు ఆలస్యంగా మూడు కారిడార్లను ఎల్ అండ్ టీ సంస్థ పూర్తి చేసింది.

జూబ్లీ బస్​స్టేషన్ నుంచి మహాత్మగాంధీ బస్​స్టేషన్ వరకు ప్రారంభం కానున్న మెట్రో కారిడార్​పై మరిన్ని విశేషాలు ఈటీవీ భారత్​ ప్రతినిధి వివరిస్తారు.

ఇవీ చూడండి:

జేబీఎస్​-ఎంజీబీఎస్​ మార్గం ఎందుకు ప్రత్యేకం..

ABOUT THE AUTHOR

...view details