సోమవారం నుంచి హైదరాబాద్ నగరంలో దశలవారీగా మెట్రో సేవలు ప్రారంభిస్తున్నామని మెట్రో ఎండీ ఎన్వీఎస్ రెడ్డి పునరుద్ఘాటించారు. సాధారణ ఉష్ణోగ్రతలు ఉంటేనే ప్రయాణించాలని కోరారు. లక్షణాలు లేనివాళ్లకు మాత్రమే మెట్రో ప్రయాణానికి అనుమతిస్తామని స్పష్టం చేశారు. ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు.
మెట్రో సిబ్బందికి పీపీఈ కిట్లు అందజేస్తాం. స్మార్ట్ కార్డులు, నగదు రహిత విధానంలోనే టికెట్లు జారీ చేస్తాం. అన్ని మెట్రో స్టేషన్లలో ఎప్పటికప్పుడు శానిటైజేషన్ చేయిస్తాం. మెట్రో స్టేషన్లు, రైళ్లలో భౌతిక దూరం పాటించేలా చర్యలు. మెట్రో స్టేషన్లలో ఐసోలేషన్ రూంలు ఏర్పాటు చేస్తున్నాం. ప్రయాణికులు తప్పనిసరిగా మాస్క్ ధరించాలి. ప్రతి ఐదు నిముషాలకు ఒక ట్రైన్ అందుబాటులో ఉంటుంది. రద్దీని బట్టి వేళల్లో మార్పులు చేర్పులు ఉంటాయి. ఫేస్ మాస్క్ తప్పనిసరి... లేనివారు స్టేషన్లో కొనుక్కోవాలి. హ్యాండ్ శానిటైజర్ నిత్యం అందుబాటులో ఉంచుతాం. ప్రయాణికులు తక్కువ లగేజీతో ప్రయాణించాలి. రైళ్లలో 75 శాతం తాజా గాలి అందుబాటులో ఉంచుతాం. అక్కడక్కడ టెర్మినల్స్ వద్ద ట్రైన్ డోర్లు కొద్దిసేపు తెరిచి ఉంచుతాము. - ఎన్వీఎస్ రెడ్డి, మెట్రో రైల్ ఎండీ