తెలంగాణలోని హైదరాబాద్-రంగారెడ్డి- మహబూబ్‌నగర్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఓట్ల లెక్కింపు ఉత్కంఠగా సాగుతోంది.‘హైదరాబాద్’ స్థానంలో పూర్తయిన ఆరు రౌండ్లలో తెరాస, భాజపా మధ్య పోటీ ఉత్కంఠ పోరు సాగుతోంది. ఆరో రౌండ్ ముగిసే సరికి తెరాస అభ్యర్థి వాణీదేవి సమీప భాజప అభ్యర్థి రామచందర్‌రావుపై 7,626 ఓట్ల ఆధిక్యంతో ముందంజలో ఉన్నారు.
ఆరో రౌండ్ లెక్కింపు పూర్తి.. ఆధిక్యంలో సురభి వాణీదేవి - ఎమ్మెల్సీ ఓట్ల లెక్కింపు వార్తలు
తెలంగాణలోని హైదరాబాద్-రంగారెడ్డి- మహబూబ్‌నగర్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. ‘హైదరాబాద్’ స్థానంలో ఆరో రౌండ్ ముగిసే సరికి తెరాస అభ్యర్థి వాణీదేవి ముందంజలో ఉన్నారు.
ఆరు రౌండ్లలో సురభి వాణీదేవికి 1,05,710 ఓట్లు, భాజపా అభ్యర్థి రామచందర్‌రావుకు 98,084, స్వతంత్ర అభ్యర్థి ప్రొ.నాగేశ్వర్‌కు 50,450, కాంగ్రెస్ అభ్యర్థి చిన్నారెడ్డికి 29,627, తెదేపా అభ్యర్థి ఎల్.రమణకు 5,606 ఓట్లు పోలయ్యాయి. ఇప్పుడున్న పరిస్థితుల్లో మెజారిటీ ఎవరికీ వచ్చే అవకాశం లేదని అధికారులంటున్నారు. రెండో ప్రాధాన్య ఓట్ల లెక్కింపు తప్పనిసరి అని, మూడో ప్రాధాన్య ఓట్లని కూడా లెక్కించే అవకాశం లేక పోలేదని అధికారులు అంటున్నారు. అదే జరిగితే శనివారం రాత్రికి తుది ఫలితాలు వెలువడవచ్చని అంచనా వేస్తున్నారు.
ఇదీ చదవండి: