ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

అరుదైన ఘనత సాధించిన 'గాంధీ' వైద్యులు - corona updates in hyderabad

కరోనా సోకిన గర్భిణికి శస్త్ర చికిత్స ద్వారా కాన్పు చేశారు హైదరాబాద్​లోని గాంధీ ఆసుపత్రి వైద్యులు. తల్లీ, బిడ్డా ఇద్దరు క్షేమంగా ఉన్నట్లు ఆ రాష్ట్ర మంత్రి ఈటల రాజేందర్ వెల్లడించారు.

hyderabad-gandhi-doctors-operation-to-corona-patient
hyderabad-gandhi-doctors-operation-to-corona-patient

By

Published : May 8, 2020, 11:57 PM IST

హైదరాబాద్​లోని గాంధీ ఆస్పత్రి వైద్యులు అరుదైన ఘనత సాధించారు. మొట్టమొదటి సారిగా కరోనా పాజిటివ్ ఉన్న గర్భిణికి శస్త్ర చికిత్స ద్వారా కాన్పు చేశారు. 22 ఏళ్ల కరోనా సోకిన మహిళ... గాంధీలో చికిత్స పొందుతోంది. మరోవైపు ఊపిరితిత్తుల సమస్యతో బాధపడుతోందని వైద్యులు తెలిపారు. మహిళకు శస్త్ర చికిత్స చేయగా.. మగబిడ్డ జన్మించినట్లు తెలంగాణ వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్‌ తెలిపారు. తల్లి, బిడ్డ ఇద్దరు క్షేమంగా ఉన్నారని... చిన్నారిని వేరుగా ఉంచినట్టు వివరించారు. చిన్నారి స్వాబ్ సేకరించి.. పరీక్షల కోసం పంపినట్టు వెల్లడించారు. శస్త్ర చికిత్స చేసిన వైద్యులను మంత్రి అభినందించారు.

ABOUT THE AUTHOR

...view details