తెలంగాణ జీహెచ్‌ఎంసీ ఎన్నికల ఓట్ల లెక్కింపు కేంద్రాల వద్ద మూడంచెల భద్రత ఏర్పాటు చేసినట్లు హైదరాబాద్ నగర పోలీసు కమిషనర్ అంజనీకుమార్ వెల్లడించారు. ప్రతి కేంద్రానికి ఏసీపీ స్థాయి అధికారి విధుల్లో ఉంచడంతో పాటు ఔట్ పోస్టు ఏర్పాటు చేస్తున్నామని సీపీ స్పష్టం చేశారు. ఎల్బీస్టేడియంలో ఏర్పాటు చేసిన కార్వాన్ నియోజకవర్గం స్ట్రాంగ్ రూంను సీపీ అంజనీకుమార్ తనిఖీ చేశారు.
లెక్కింపు కేంద్రాల వద్ద మూడంచెల భద్రత: సీపీ అంజనీకుమార్ - ghmc counting date
తెలంగాణ బల్దియా పోరులో కీలక ఘట్టమైన ఓట్ల లెక్కింపు ప్రక్రియను గట్టి బందోబస్తు నడుమ నిర్వహించేందుకు పోలీసులు అన్ని ఏర్పాట్లు చేశారు. లెక్కింపు కేంద్రాల వద్ద ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా... మూడంచెల భద్రత ఏర్పాటు చేసినట్లు సీపీ అంజనీకుమార్ వెల్లడించారు.
లెక్కింపు కేంద్రాల వద్ద మూడంచెల భద్రత: సీపీ అంజనీకుమార్
అన్ని శాఖల అధికారులతో కలిసి కమిషనరేట్ పరిధిలో 15 లెక్కింపు కేంద్రాలను తనిఖీ చేసినట్లు తెలిపారు. కౌంటింగ్ సమయంలో ఎలాంటి ర్యాలీలకు అనుమతులు లేవని సీపీ పేర్కొన్నారు. ఓల్డ్ మలక్‌పేటలో రీపోలింగ్ ప్రక్రియకు సైతం అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని సీపీ వివరించారు.