కరోనా లాంటి విపత్కర పరిస్థితుల్లో పనిచేస్తున్న తమకు జీతాలు పెంచాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ రాజధాని హైదరాబాద్లోని గాంధీ ఆసుపత్రి ఔట్సోర్సింగ్ సిబ్బంది, పారిశుద్ధ్య కార్మికులు ఆందోళనకు దిగారు. ఆసుపత్రి ఎదుట బైఠాయించి నిరసన తెలిపారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
హైదరాబాద్: గాంధీ ఆసుపత్రి ఎదుట ఔట్సోర్సింగ్ సిబ్బంది, పారిశుద్ధ్య కార్మికుల ఆందోళన
తెలంగాణ రాజధాని హైదరాబాద్లోని గాంధీ ఆసుపత్రి ఔట్సోర్సింగ్ సిబ్బంది, పారిశుద్ధ్య కార్మికులు ఆందోళన చేపట్టారు. ప్రభుత్వం తక్షణమే తమ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు.
హైదరాబాద్: గాంధీ ఆసుపత్రి ఎదుట ఔట్సోర్సింగ్ సిబ్బంది, పారిశుద్ధ్య కార్మికుల ఆందోళన
గత కొన్ని రోజులుగా ప్రభుత్వంతో చర్చలు జరుపుతున్నా.. అవి సఫలం కావడం లేదని వారు ఆరోపించారు. తమ ప్రాణాలను పణంగా పెట్టి పనిచేస్తున్నా.. ప్రభుత్వం గుర్తించడం లేదని వాపోయారు. వెంటనే జీతాలు పెంచి తమను ఆదుకోవాలని కోరారు. ఔట్సోర్సింగ్ ఉద్యోగులను శాశ్వత ఉద్యోగులుగా గుర్తించి.. ఉద్యోగ భద్రత కల్పించాలన్నారు. ఇప్పటికీ ప్రభుత్వం స్పందించకపోతే విధులకు హాజరుకాబోమని స్పష్టం చేశారు.
ఇదీచూడండి:కరోనా అనుమానితుల పరీక్షలకు ర్యాపిడ్ యాంటీజెన్ కిట్లు
TAGGED:
గాంధీ ఆసుపత్రి తాజా వార్తలు