ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Nov 12, 2021, 10:29 AM IST

ETV Bharat / city

ys Sharmila: వైఎస్‌ షర్మిల "రైతు వేదన నిరాహార దీక్ష"కు.. అనుమతి నిరాకరణ

తెలంగాణలో రైతుల సమస్యలపై వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల (ys Sharmila) నిర్వహించ తలపెట్టిన రైతు వేదన నిరాహార దీక్షకు (police decline permission for Sharmila's protest) ఆ రాష్ట్ర పోలీసులు అనుమతికి నిరాకరించారు. దీంతో ఇందిరా పార్కు వద్ద ఇవాళ వైఎస్​ షర్మిల చేయాలనుకున్న దీక్షకు అడ్డుకట్ట పడింది.

ys Sharmila
వైఎస్‌ షర్మిల

తెలంగాణలో వైఎస్సార్ తెలంగాణ పార్టీ (ysrtp) అధ్యక్షురాలు వై.ఎస్. షర్మిల (ys Sharmila) రైతుల సమస్యలపై నిర్వహించ తలపెట్టిన రైతు వేదన నిరాహార దీక్షకు ఆ రాష్ట్ర పోలీసులు అనుమతికి నిరాకరించారు. (police decline permission for Sharmila's protest) హైదరాబాద్‌లోని ఇందిరాపార్క్ వద్ద షర్మిల ఇవాళ్టి నుంచి 72 గంటల దీక్ష చేపట్టాలని భావించారు.

కానీ.. పోలీసులు అనుమతి ఇవ్వలేదని వైఎస్సార్ తెలంగాణ పార్టీ ఓ ప్రకటనలో వెల్లడించింది. 9 జిల్లాల్లో ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ అమల్లో ఉండడంతో అక్కడ కూడా దీక్ష చేయలేని పరిస్థితి ఉందని పార్టీ నేతలు పేర్కొన్నారు.

ఇదీ చూడండి:Amaravathi Raithu yatra : ఆంక్షల నడుమ.. పన్నెండో రోజు మహాపాదయాత్ర..

ABOUT THE AUTHOR

...view details