Bansilal Pate Ancient Step Well Restoration Works: హైదరాబాద్ బన్సీలాల్ పేట్ పురాతనమైన మెట్ల బావి పునరుద్దరణ పనులు చివరి దశకు చేరుకున్నాయి. మరికొన్ని రోజుల్లో ఈ అద్భుత కట్టడాలను ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చే విధంగా జీహెచ్ఎంసీ పనులు చేస్తోంది. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో సుమారు 100 కు పైగానే మెట్ల బావులు ఉంటాయని అధికారులు తెలిపారు. వీటిలో సుమారు 20 బావుల వరకు అక్రమాలకు గురైయ్యాయని, మిగిలినవి శిథిలావస్థలో చేరుకున్నాయని పేర్కొన్నారు.
బన్సీలాల్ పేట్ మెట్ల బావి.. ఎంత అద్భుతంగా ఉందో మీరూ చూడండి - హైదరాబాద్ బన్సీలాల్ పేట్ పురాతనమైన మెట్ల బావి
Bansilal Pate Ancient Step Well Restoration Works: తెలంగాణ నిజాం కాలంలో నిర్మించిన పురాతన మెట్ల బావులు అవి.. ఈ నీటితోనే నగర ప్రజలు తాగునీటి, రోజువారి అలవాట్లకు నీటిని తీసుకొని వినియోగించుకునేవారు.. ఇది నాటి చరిత్ర. కానీ నేడు ఈ మెట్ల బావులు ఎందుకు పనికిరానివిగా చెత్తా చెదారంతో నిండిపోయాయి. ఇలాంటి నగరం మొత్తం 100 పై చిలుకు బావులే ఉన్నాయి. అయితే వీటిని పట్టించుకోనే నాదుడే లేడు. అయితే ఓ స్వచ్ఛంద సంస్థ చొరవతో జీహెచ్ఎంసీ కలిసి పునరుద్ధరణ పనులు చేపట్టింది. ఇది పర్యాటకులను ఆకర్షిస్తోందని బల్దియా పేర్కొంది.
![బన్సీలాల్ పేట్ మెట్ల బావి.. ఎంత అద్భుతంగా ఉందో మీరూ చూడండి Steps Well](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-16677642-1084-16677642-1666073513055.jpg)
కొన్ని బావుల స్థలాల్లో నిర్మాణాలు వెలిశాయి.. మరికొన్ని స్థలాల్లో చెత్తతో బావులు నిండి ఉన్నాయని అన్నారు. దీంతో బావులు రూపు కోల్పోయి చెత్తకు ఆవాసాలుగా మారాయి. వీటిని పునరుద్ధరించేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అతి పెద్ద బన్సీలాల్ పేట్ పురాతనమైన మెట్ల బావి 30.5 మీటర్ల పొడవు, 19.2 ఫీట్ల వెడల్పు, 53 అడుగుల లోతు కలిగి ఉంది. ఈ బావి పూర్తిగా చెత్త, వ్యర్ధాలతో నిండిపోయింది. గత కొద్ది నెలల పాటు శ్రమించి సహిత స్వచ్ఛంద సంస్థ, జీహెచ్ఎంసీ ఆధ్వర్యంలో 2 వేల మెట్రిక్ టన్నుల చెత్తను తొలగించారు. బావిలోని చెత్త తొలగింపునకు ముందు ఉన్న పరిస్థితి, ప్రస్తుత పరిస్థితులను వివరించేలా ప్రతి గోడ దగ్గర ఫోటో ప్రదర్శన ఏర్పాటు చేస్తున్నారు. ఈ మెట్ల బావికి టూరిజం ప్రాంతంగా బల్దియా మారుస్తోంది.
ఇవీ చదవండి: