జగన్ కేసులో కౌంటర్ దాఖలుకు గడువు కోరిన సీబీఐ.. చివరి అవకాశమన్న కోర్టు - జగన్ అక్రమాస్తుల కేసు తాజా వార్త
15:52 September 06
జగన్ పిటిషన్‌పై కౌంటరు దాఖలుకు సీబీఐకి చివరి అవకాశం ఇచ్చిన కోర్టు
హైదరాబాద్‌లోని సీబీఐ, ఈడీ కోర్టులో జగన్ అక్రమాస్తుల కేసుల విచారణ జరిగింది. పెన్నా ఛార్జ్ షీట్‌లో జగన్ డిశ్చార్జ్ పిటిషన్‌పై కౌంటరు దాఖలుకు మరోసారి సీబీఐ గడువు కోరింది. పెన్నా సిమెంట్స్‌పై కౌంటరుకు చివరి అవకాశం ఇస్తున్నామని కోర్టు స్పష్టం చేసింది. జగన్ పిటిషన్‌పై కౌంటరు దాఖలుకు సీబీఐకి ఇదే చివరి అవకాశమని తెలిపింది. పెన్నా కేసులో విజయసాయిరెడ్డి, సబిత, శామ్యూల్, రాజగోపాల్ డిశ్చార్జ్ పిటిషన్లపై విచారణ వాయిదా పడింది.
గడువు కోరిన ఈడీ..
అరబిందో, హెటిరో కేసుల వాదనలు వినిపించేందుకు కోర్టును ఈడీ గడువు కోరింది. నిందితులు కూడా వాదనలకు సిద్ధం కావాలని కోర్టు స్పష్టం చేసింది. తన బదులు న్యాయవాది హాజరుకు అనుమతి ఇవ్వాలని జగన్ న్యాయస్థానాన్ని కోరారు. ఈ మేరకు దాఖలు చేసిన పిటిషన్‌పై ఈ నెల 13కు విచారణ వాయిదా వేసింది.