కరీంనగర్ హుజూరాబాద్ అసెంబ్లీ నియోజకవర్గ ఉప ఎన్నికకు పోలింగ్ ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఈరోజు ఉదయం ఏడు నుంచి రాత్రి ఏడు గంటల వరకు ఓటింగ్‌లో పాల్గొనవచ్చు. చివరి గంటను కొవిడ్‌తో బాధపడుతున్న వారు పీపీఈ కిట్లతో వచ్చి ఓటు వేసేందుకు కేటాయించారు. ‘‘2018లో 84.5 శాతం పోలింగ్ నమోదైంది. ఈ సారి మరింత పెంచేలా ఓటర్లు స్వచ్ఛందంగా ఓటు హక్కు వినియోగించుకోవాలి’’ అని కేంద్ర ఎన్నికల సంఘం రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి డాక్టర్ శశాంక్ గోయల్ కోరారు. శుక్రవారం ఇక్కడ ఆయన విలేకరులతో మాట్లాడారు.
‘‘అన్ని కేంద్రాల్లో వెబ్‌కాస్టింగ్ చేస్తున్నాం. ఓటర్లు విధిగా మాస్క్ ధరించి ఓటేయడానికి వెళ్లాలి. వివిధ అంశాలపై వచ్చిన ఫిర్యాదులను ఎప్పటికప్పుడు క్షేత్రస్థాయి అధికారులు పరిశీలిస్తున్నారు. కొన్నింటిపై కేసులు కూడా నమోదు చేశారు. రూ.మూడున్నర కోట్ల వరకు నగదును స్వాధీనం చేసుకున్నారు’’ అని ఆయన వివరించారు. ప్రతి పోలింగ్ కేంద్రంలో రెండు ఈవీఎంలను ఏర్పాటు చేస్తున్నారు. మొదటి దానిలో 16 మంది, రెండో దానిలో 14 మంది అభ్యర్థులతోపాటు చివరన నోటా గుర్తు ఉంటుంది. నవంబరు 2న కరీంనగర్‌లో ఓట్ల లెక్కింపును చేపట్టనున్నారు.
మూడో ఉప ఎన్నిక ఇది..