భార్య పెట్టే వేధింపులు తట్టుకోలేక భర్త ఆత్మహత్య చేసుకున్నాడు. కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. శ్రీనాథ్ (39) 2009లో ఆంధ్రాకు చెందిన రేఖను వివాహం చేసుకున్నాడు. పెళ్లి తరువాత కర్నాటక రాష్టంలోని బెలాందూర్లో బ్యాంకు నుంచి రుణం తీసుకుని ఒక అపార్ట్మెంట్ కొన్నాడు. మొదటినుంచి రేఖ విలాసంతవమైన జీవితాన్ని గడుపుతూ డబ్బులు విచ్చలవిడిగా ఖర్చు చేసేది. శ్రీనాథ్ ఎన్నిసార్లు చెప్పినా తను వినిపించుకోలేదు. అంతేకాకుండా భర్తను వేధించటం మొదలుపెట్టింది. ఓ వైపు అప్పులు.. మరోవైపుభార్య వేధింపులు భరించలేక ఆఖరికి శ్రీనాథ్ తన గృహంలోనే ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసులు రేఖ, ఆమె తల్లిదండ్రులపై భారత శిక్షాస్మృతి (ఐపీసీ) 306,34 సెక్షన్ల కింద కేసులు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు.
భార్య వేధింపులు తట్టుకోలేక ఆంధ్రా అల్లుడు ఆత్మహత్య
భార్య వేధింపులు తట్టుకోలేక భర్త ఆత్మహత్య చేసుకున్న ఘటన కర్నాటక రాష్ట్రంలోని బెంగళూరులో జరిగింది.
భార్య వేధింపులు తాళలేక ఆంధ్రా అల్లుడు ఆత్మహత్య