తెలంగాణలోని పుణ్యక్షేత్రం యాదాద్రి భువనగిరి జిల్లాలోని ప్రసిద్ధ పుణ్య క్షేత్రం యాదాద్రి లక్ష్మీ నరసింహ స్వామి వారి ఆలయంలో హుండీని లెక్కించారు. 19 రోజుల్లో రూ. 57 లక్షల 18 వేల 345, 25 గ్రాముల బంగారం, 1,500 గ్రాముల వెండి.. ఖజానాకు వచ్చినట్లుగా ఆలయ కార్యనిర్వాహణ అధికారి గీతా రెడ్డి తెలిపారు. మాస్కులు, చేతులకు గ్లౌస్లు ధరించి.. భౌతిక దూరం పాటిస్తూ హుండీ లెక్కించారు. కార్యక్రమంలో ఆలయాధికారులు, పోలీస్ సిబ్బంది, ఆలయ సిబ్బంది పాల్గొన్నారు.
7 రోజుల పాటు నిలిపివేత..
యాదాద్రి దేవస్థానంలో ఇటీవలే పూజారులు, ఆలయ ఉద్యోగులు, సిబ్బంది కొవిడ్ బారిన పడిన విషయం తెలిసిందే. అందువల్ల 7 రోజుల పాటు ఆలయంలో ఆర్జిత సేవలు నిలిపివేశారు.