ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

సందడిగా సాగుతున్న హునర్ హాట్ మేళా - Hunar Hat Mela at delhi

కరోనా తర్వాత ఇప్పుడిప్పుడే అన్ని రంగాలు నిలదొక్కుకుంటున్నాయి. హస్తకళలపై ఆధారపడిన కళాకారులు సైతం తమ ఉత్పత్తుల అమ్మకాలపై దృష్టిపెట్టారు. దేశ రాజధాని దిల్లీలో ఏటా నిర్వహించే హునర్ హాట్ ఘనంగా జరుగుతోంది. హస్తకళలకు ఆపన్నహస్తం అందించేలా నిలిచిన ఈ ప్రదర్శన ఇవాళ్టితో ముగియనుంది.

సందడిగా సాగుతున్న హునర్ హాట్ మేళా
సందడిగా సాగుతున్న హునర్ హాట్ మేళా

By

Published : Mar 1, 2021, 9:04 PM IST

సందడిగా సాగుతున్న హునర్ హాట్ మేళా

దిల్లీ జవహర్​లాల్​ నెహ్రూ మైదానంలో సందడిగా కొనసాగుతున్న హునర్ హాట్ మేళా నేడు రాత్రితో ముగియనుంది. అల్ప సంఖ్యాక వర్గాల వారు తయారు చేసే హస్తకళల విక్రయమే ప్రధాన లక్ష్యంగా కేంద్ర మైనార్టీ వ్యవహారాల శాఖ ఆధ్వర్యంలో జరిగిన ఈ మేళాను ఫిబ్రవరి 20న కేంద్ర రక్షణ శాఖమంత్రి రాజ్ నాథ్ సింగ్ ప్రారంభించారు. హస్తకళాకారుల ఆర్థిక సాధికారత కోసం... మెగా మిషన్​లా దేశ వ్యాప్తంగా ప్రధాన నగరాల్లో హునర్ హాట్లను కేంద్రం నిర్వహిస్తోంది. 'వోకల్ ఫర్ లోకల్' అనే ఇతివృత్తంతో దేశీయ వస్తువులకు విస్తృత ప్రచారం, వినియోగించేలా ఈసారి తీర్చిదిద్దారు. దేశీయ వస్తువుల వినియోగంపై ప్రజలకు అవగాహన కల్పించడంతో పాటు హస్తకళాకారుల నైపుణ్యాలకు చేయూతనివ్వాలని కేంద్రం నిర్వహిస్తోంది. హస్తకళలను ప్రోత్సహించడంతో పాటు అన్ని రాష్ట్రాల ఆహార పదార్థాలు, సంస్కృతులను ప్రదర్శించి ఒకే చోట మినీ భారతాన్ని ప్రతిబింబించారు.

తెలుగు రాష్ట్రాల నుంచి నిజామాబాద్, శ్రీకాళహస్తికి చెందిన హస్తకళాకారుల ఉత్పత్తులను ఈ మేళాలో ప్రదర్శించారు. చెక్క బొమ్మలు, ఆదివాసీల ఆభరణాలు, కలంకారీ వస్త్రాలు ఆకట్టుకుంటున్నాయి. షోలాపూర్ చెప్పులు, భాగల్​పురి సిల్క్, జమ్ముకశ్మీర్ శాలువాలు, వారణాసి సిల్క్, ఇనుముతో చేసిన పూలకుండీల స్టాండులు, కార్పెట్లు, గాజు వస్తువులు ప్రదర్శనలో కొలువుదీరాయి. అన్ని రాష్ట్రాల నుంచి దాదాపు 250కి పైగా స్టాళ్లను అందుబాటులో ఉంచారు.

హునర్ హాట్ 26వ ఎడిషన్​లో భాగంగా నిర్వహించిన ఈ మేళాలో దాదాపు 15 లక్షల మందికి పైగా సందర్శకులు వచ్చినట్లు నిర్వాహకులు తెలిపారు. కరోనా తర్వాత ఇదొక సువర్ణావకాశంగా ఉపయోగపడిందన్నారు. మరోవైపు భిన్న సంస్కృతులను చూడటం, నచ్చినవి కొనుక్కునే అవకాశం లభించడంతో ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

ఇదీ చదవండి:విమానాశ్రయంలో చంద్రబాబుని అడ్డుకున్న పోలీసులు

ABOUT THE AUTHOR

...view details