రాష్ట్ర వ్యాప్తంగా భారీగా అడిషనల్ ఎస్పీ స్థాయి అధికారులను బదిలీ చేస్తూ.. ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. డీఎస్పీ స్థాయిలో ఉన్న 29 మంది అధికారులకు అడిషనల్ ఎస్పీలుగా పదోన్నతులు కల్పించి బదిలీ చేశారు.
విజయవాడ క్రైం ఏడీసీపీగా బోస్, కృష్ణంరాజును ఏడీసీపీ లా అండ్ ఆర్డర్-1, లక్ష్మీపతిని ఏడీసీపీ లా అండ్ ఆర్డర్-2, సర్కార్ను ఏడీసీపీ ట్రాఫిక్గా బదిలీ చేస్తూ ఉత్తర్వులు ఇచ్చారు. మరో నలుగురు ఏడీసీపీ స్థాయి అధికారులకు స్థానచలనం కల్పించారు.