గుంటూరు జిల్లా మంగళగిరిలోని తెలుగుదేశం జాతీయ కార్యాలయంలో సందడి నెలకొంది. పార్టీ అధినేత చంద్రబాబు నాయుడును కలిసేందుకు పెద్దసంఖ్యలో నాయకులు, కార్యకర్తలు, ప్రజలు భారీగా తరలివచ్చారు. విశాఖ జిల్లా నేతలు బండారు సత్యనారాయణమూర్తి, పల్లా శ్రీనివాస్, శ్రీకాకుళం ఎంపీ రామ్మోహన్‌నాయుడు, మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు, కాకినాడ మేయర్ సుంకర పావని సహా పలువురు నాయకులు... పార్టీ కార్యాలయంలో చంద్రబాబును కలిశారు. అధినేతను కలిసిన కార్యకర్తలు తమ అభ‌్యర్థనలు నివేదించారు. అలాగే తెలుగుదేశం కార్యాలయానికి వచ్చిన ప్రజలు వివిధ సమస్యలపై చంద్రబాబుకు వినతిపత్రాలు సమర్పించారు. అందరి విజ్ఞాపనలు స్వీకరించిన చంద్రబాబు సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు.
TDP office: మంగళగిరి తెదేపా కార్యాలయంలో సందడి - TDP president chandrababu
మంగళగిరిలోని తెదేపా జాతీయ కార్యాలయంలో పార్టీ అధినేత చంద్రబాబును కలిసేందుకు పలువురు నేతలు, కార్యకర్తలు, ప్రజలు వచ్చారు. తమ సమస్యలను పరిష్కరించాలని వినతి పత్రాలు సమర్పించారు.
మంగళిగిరి తెదేపా కార్యాలయంలో సందడి