ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

కార్యదర్శుల పరీక్షకు భారీ స్పందన..92.50% హాజరు - huge response to village, ward secreaterte jobs exams in andhrapradesh

గ్రామ సచివాలయ ఉద్యోగ నియామకాల్లో భాగంగా... ఆదివారం ఉదయం కేటగిరి-1లో 4 రకాల ఉద్యోగాలకు రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించిన రాత పరీక్షకు భారీ స్పందన లభించింది. దాదాపు 90 శాతానికి పైగా అభ్యర్థులు హాజరుకావట రికార్డని అధికారులు అభిప్రాయపడుతున్నారు. జిల్లాల వారీగా హాజరు శాతం వివరాలు చూస్తే..

కార్యదర్శల పరీక్షకు భారీ స్పందన..92.50% హాజరు

By

Published : Sep 2, 2019, 5:09 AM IST

Updated : Sep 2, 2019, 5:25 AM IST


గ్రామ సచివాలయ ఉద్యోగాలకు ఆదివారం ఉదయం కేటగిరి-1లోని 4 రకాల పోస్టులకు జరిగిన రాత పరీక్షకు భారీ స్పందన లభించింది. దరఖాస్తు చేసిన అభ్యర్థులు వెల్లువలా తరలివచ్చి పరీక్ష రాశారు. దాదాపు 11.58 లక్షల మంది తరలి రావటంతో రాష్ట్రవ్యాప్తంగా పరీక్ష సందడి ఏర్పడింది. 90 శాతానికి పైగా అభ్యర్థులు పరీక్ష రాయటం రికార్డని అధికారులు అభిప్రాయపడుతున్నారు.
లెక్కలు ఇలా ఉన్నాయి..
కేటగిరీ-1 పరీక్ష వివరాలు..

పోస్టులు-36,449
దరఖాస్తు చేసుకున్న వారు- 12,54,034 మంది
హాజరైనవారు- 11,58,538(92.50 %)
గైర్హాజరు- 23,560 మంది

కేటగిరి-3 పరిధిలోని పోస్టులకు 12,54,034 మంది దరఖాస్తు చేసుకోగా..11,58,538 మంది హాజరయ్యారు. 95,436 మంది గైర్హాజరైనట్లు అధికారులు వెల్లడించారు.


కేటగిరీ-1 పరీక్షకు జిల్లాల వారీగా హాజరు

జిల్లా మొత్తం అభ్యర్థులు హాజరు శాతం
శ్రీకాకుళం 70,589 65,980 93.47
విజయనగరం 58,812 55,095 93.68
విశాఖపట్నం 1,31,722 1,21,821 92.48
తూర్పుగోదావరి 1,24,795 1,15,698 92.71
పశ్చిమగోదావరి 86015 80392 93.46
కృష్ణా 1,14,128 1,01,982 89.36
గుంటూరు 1,12,223 1,02,947 91.73
ప్రకాశం 75899 69496 91.56
నెల్లూరు 73797 68668 93.05
చిత్తూరు 1,07,721 1,00,409 93.21
కడప 8,2534 76927 93.21
అనంతపురం 1,00,208 9,2865 92.67
కర్నూలు 1,15,531 1,06,258 91.97

మొత్తం 12,53 974 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగా...11,58,538 మంది హాజరైనట్లు అధికారులు తెలిపారు.

Last Updated : Sep 2, 2019, 5:25 AM IST

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details