తెలంగాణలోబేగంపేటలోని ఓ అంతర్జాతీయ కొరియర్ కార్యాలయంలో.... పోలీసులు తనిఖీ నిర్వహించారు. అనుమానాస్పదంగా కనిపించిన పార్శిల్‌ను విప్పి చూశారు. ఫోటో ఫ్రేమ్‌ల లోపల నిషేధిత డ్రగ్స్‌ను ప్యాకింగ్ చేశారు. ఎవరికీ అనుమానం రాకుండా సూడోఎఫిడ్రిన్ (Pseudoephedrine) అనే డ్రగ్స్‌ను... ఫోటో ఫ్రేమ్‌ల మధ్య కవర్‌లో అమర్చి ఆస్ట్రేలియాకు కొరియర్ చేశారు. బేగంపేట పోలీసులు వెంటనే డీఆర్ఐ అధికారులకు సమాచారమిచ్చారు. డీఆర్ఐ అధికారులు కొరియర్ కార్యాలయానికి చేరుకొని.. వివరాలు సేకరించారు. నిషేధిత డ్రగ్స్‌ను పార్శిల్ చేసిన వ్యక్తి.. నకిలీ ఆధార్ కార్డు సమర్పించినట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది (fake identity). ఆధార్ చిరునామా ప్రకారం తమిళనాడులో సంప్రదించగా.. తప్పుడు అడ్రస్‌గా తేలింది. దీంతో పోలీసులు కొరియర్ కార్యాలయంలో ఉన్న సీసీ కెమెరాలతో పాటు.. నిందితుడి చరవాణి ఆధారంగా అతన్ని పట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. నెల రోజుల కిందట... ఎన్సీబీ అధికారులు అబిడ్స్‌లోని కొరియర్ కార్యాలయంలో తనిఖీలు నిర్వహించి... 3 కిలోల సూడోఎఫిడ్రిన్‌ను స్వాధీనం చేసుకున్నారు. నిందితుడు చీరలను ప్యాకింగ్ చేసి... ఆస్ట్రేలియా చిరునామాతో పార్సిల్ చేశాడు. చీరల ఫాల్స్ లోపల సూడోఎఫిడ్రిన్‌ను ఉంచాడు. పార్సిల్ చేసిన వ్యక్తి తప్పుడు చిరునామాను సమర్పించాడు. చెన్నై ఎన్సీబీ అధికారులు... రెండు రోజుల పాటు తనిఖీలు నిర్వహించి నిందితుడిని అరెస్టు చేశారు.
ఇతర దేశాల్లో భారీ డిమాండ్ ఉండడంతో..
ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, ఇండోనేసియా, మలేషియా దేశాల్లో... కొన్ని రకాల మాదక ద్రవ్యాలను ఎఫిడ్రిన్ ఉపయోగించి తయారు చేస్తారు (drugs trafficking from Hyderabad). దీంతో అక్కడ ఎఫిడ్రిన్, సూడొఎఫిడ్రిన్‌కు విపరీతమైన డిమాండ్ ఉంటుంది. ఇక్కడ 50వేల రూపాయల విలువ చేసే ఎఫిడ్రిన్... ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌లో 5లక్షల రూపాయల విలువ చేస్తుంది. ఎఫిడ్రిన్‌ను తయారు చేసే పరిశ్రమలు ఆయా దేశాల్లో ఎక్కువగా లేకపోవడంతో... దిగుమతిపై ఆధారపడుతున్నారు.
భాగ్యనగరం అడ్డాగా..