ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

Liquor sales in Telangana: బీర్ల అమ్మకాలు తగ్గాయి.. లిక్కర్ విక్రయాలు పెరిగాయి - తెలంగాణలో మద్యం విక్రయాలు

Liquor sales in Telangana: తెలంగాణలో మద్యం భారీగా అమ్ముడుపోతోంది. గడిచిన ఆరేళ్ల కాలంలో రూ.లక్ష 27 వేల కోట్లకుపైగా విలువైన 19.38 కోట్ల కేసుల లిక్కర్‌, 23.62 కోట్ల కేసుల బీర్లను తాగేశారు. అన్ని రంగాలపై కరోనా ప్రభావం పడినా మద్యం విక్రయాలపై మాత్రం ఆ జాడ ఎక్కడా కనిపించలేదు. ఐటీ రంగంతోపాటు ఇతర ప్రైవేటు ఉద్యోగులు ఎక్కువ భాగం ఇంటి వద్ద నుంచే ఉద్యోగాలు చేస్తున్నందున బీర్ల అమ్మకాలు తగ్గినా.. లిక్కర్‌ విక్రయాలు మాత్రం క్రమంగా పెరిగినట్లు అబ్కారీ శాఖ గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి.

బీర్ల అమ్మకాలు తగ్గాయి...లిక్కర్ విక్రయాలు పెరిగాయి
బీర్ల అమ్మకాలు తగ్గాయి...లిక్కర్ విక్రయాలు పెరిగాయి

By

Published : Dec 21, 2021, 1:27 PM IST

Liquor sales in Telangana: తెలంగాణలో ఏటా మద్యం అమ్మకాల విలువ పెరుగుతూనే ఉన్నాయి. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత గత ఆరు సంవత్సరాల్లో లక్ష 27 వేల 238 కోట్లు విలువైన 19.38 కోట్లు కేసుల లిక్కర్‌, 23.62 కోట్లు కేసుల బీర్లను మద్యం ప్రియులు తాగేశారు. అబ్కారీ శాఖ లెక్కల ప్రకారం.. 2016లో రూ.14,075.51 కోట్లు విలువైన 2.72 కోట్లు కేసుల లిక్కర్‌, 3.42 కోట్లు కేసుల బీర్ల అమ్మకాలు జరిగాయి. అదేవిధంగా 2017లో రూ.16,595.97 కోట్లు, 2018లో రూ.20,012.05 కోట్లు, 2019లో రూ.22,144.87 కోట్లు, 2020లో రూ.25,601.39 కోట్లు, 2021లో ఇప్పటి వరకు రూ. 28,808.06 కోట్లు విలువైన మద్యం అమ్ముడుపోయింది. '

రంగారెడ్డిలో అత్యధికం..

మద్యం అమ్మకాలను ఎక్సైజ్‌ జిల్లాల వారీగా చూసినట్లయితే ఈ ఆరేళ్ల కాలంలో ఆదిలాబాద్​లో రూ.3,404.60 కోట్లు, ఆసిఫాబాద్‌ రూ.733.76 కోట్లు, భూపాలపల్లి రూ.1,752.43 కోట్లు, గద్వాల్‌ రూ.619.79 కోట్లు, హైదరాబాద్‌ రూ.15,084.72 కోట్లు, జగిత్యాల రూ.2,268.82 కోట్లు, జనగాం రూ.1,090.63 కోట్లు, కామారెడ్డి రూ.1,073.12 కోట్లు, కరీంనగర్‌ రూ.6,332.77 కోట్లు, ఖమ్మం రూ.7,199.09 కోట్లు, కొత్తగూడెం రూ.1,359.31 కోట్లు, మహబూబ్‌నగర్‌ రూ.6,284.28 కోట్లు, మహబూబాబాద్‌ రూ.1,576.19 కోట్లు, మంచిర్యాల రూ.1,476.17 కోట్లు, మెదక్‌ రూ.5,713.51 కోట్లు, మేడ్చల్‌ రూ.8,610.93 కోట్లు, నాగర్‌కర్నూల్‌ రూ.1,295.58 కోట్లు, నల్గొండ రూ.9,890.66 కోట్లు, నిర్మల్‌ రూ.1,761.43 కోట్లు, నిజామాబాద్‌ రూ.5,236.19 కోట్లు, పెద్దపల్లి రూ.2,068.31 కోట్లు, రంగారెడ్డి రూ 22,010.50 కోట్లు, సంగారెడ్డి రూ.2,790.31 కోట్లు, సిద్దిపేట రూ.1,814.59 కోట్లు, సిరిసిల్ల రూ.8,92.73 కోట్లు, సూర్యాపేట రూ.2,040.18 కోట్లు, వికారాబాద్‌ రూ.1,153.55 కోట్లు, వనపర్తి రూ.786.27 కోట్లు, వరంగల్ రూ.1,294.02 కోట్లు, హనుమకొండ రూ.7,872.16 కోట్లు, యాదాద్రి రూ.1,751.24 కోట్లు లెక్కన జిల్లాల్లో మద్యం అమ్మకాలు జరిగినట్లు అబ్కారీ శాఖ అధికారిక లెక్కలు వెల్లడిస్తున్నాయి.

రూ. లక్షా 27వేల కోట్లు..

తెలంగాణలో ఆరు సంవత్సరాల్లో జరిగిన రూ. లక్షా 27వేల కోట్లు విలువైన మద్యంలో హైదరాబాద్‌, రంగారెడ్డి, మేడ్చల్‌ జిల్లాల్లోనే దాదాపు యాబై వేల కోట్లు విలువైన మద్యాన్ని విక్రయించారు. ఇందులో హైదరాబాద్‌లో 15 వేల కోట్లకుపైగా ఉండగా రంగారెడ్డి జిల్లాలో 22 వేల కోట్లకుపైగా ఉంది. మేడ్చల్‌ జిల్లాలో దాదాపు 9 వేల కోట్లు మేర మద్యం అమ్మకాలు జరిగాయి.

సింహభాగం హైదరాబాద్‌లోనే..

వాస్తవానికి తెలంగాణలో జరిగే మద్యం విక్రయాల్లో సింహభాగం హైదరాబాద్‌ నగరంలో ఉంటుంది. 2020 మార్చిలో కరోనా విజృంభించడం లాక్‌డౌన్‌ ప్రకటించడం.. ఆ తరువాత ఇంటి నుంచి పనిచేసే వెసులుబాటు దాదాపు అన్ని ప్రైవేటు సంస్థలు కల్పించాయి. దీంతో దాదాపు అయిదు లక్షల మంది ఐటీ ఉద్యోగులు, మరో రెండు లక్షల మంది ఇతర సంస్థల ఉద్యోగులు ఇంటి వద్ద నుంచే పనిచేస్తున్నట్లు అంచనా. వీరంతా ఇంటి వద్ద నుంచి ఉద్యోగ విధులు నిర్వర్తించడం వల్ల హైదరాబాద్‌లో వీకెండ్​ పార్టీలు, ఇతర కార్యక్రమాలపై ప్రభావం పడింది. ఫలితంగా బీర్ల విక్రయాలు సగానికి పడిపోయాయి. లేకుంటే మద్యం విక్రయాలు 35 వేల కోట్ల రూపాయల అమ్మకాలు జరిగేవని చెబుతున్నారు. ఉద్యోగులు ఇళ్ల నుంచే పనిచేస్తున్నా... డిసెంబరు 20 నాటికి రూ.29 వేల కోట్ల విలువైన మద్యం విక్రయాలు జరిగాయి. ఈ నెలలో ఇంకో పదిరోజులు ఉండడంతో.. ఈ విక్రయాలు 30 వేల కోట్లకు దాటే అవకాశం ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు.

ABOUT THE AUTHOR

...view details