Electricity Bill: తెలంగాణలోని నల్గొండ జిల్లా చింతపల్లి మండల కేంద్రంలో రెండు ఇళ్లకు ఏకంగా రూ.1,75,706ల కరెంట్ బిల్లులు రావడంతో లబ్ధిదారులు లబోదిబోమంటున్నారు. మండల కేంద్రానికి చెందిన నల్లవెళ్లి పుల్లయ్య ఇంటికి గత నెల 16 నుంచి ఈ నెల 5 వరకు 8672 యూనిట్లు రీడింగ్ తిరిగినట్లు రూ.87,338 బిల్లు వేశారు. నల్లవెళ్లి నిరంజన్ ఇంటికి 20 రోజులకు 8793 యూనిట్లు తిరిగినట్లు రూ.88,368 బిల్లు వేశారు. రెండు బల్బులు, ఒక ఫ్యాన్ ఉండగా రూ.వేలల్లో బిల్లులు ఎలా వేస్తారని లబ్ధిదారులు ప్రశ్నిస్తున్నారు.
Electricity Bill: రెండిళ్లు.. 20 రోజులు.. కరెంటు బిల్లు ఎంతంటే..?
Electricity Bill: దళితులకు ఉచిత విద్యుత్ అంటూ ఇన్ని రోజులుగా వారికి కరెంట్ బిల్లు కొట్టలేదు. సిబ్బంది మారడంతో ఈసారి ఆ ఇళ్లకు కరెంట్ బిల్లు వచ్చింది. ఆ 'మొత్తం' చూసిన వారికి ఒక్కసారిగా షాక్ కొట్టినంత పనైంది. తాము తలదాచుకుంటున్న ఇళ్లను అమ్ముకున్నా.. ఆ బిల్లులను కట్టలేమనే పరిస్థితిని తెచ్చింది. అసలు ఆ బిల్లుల్లో ఉన్న 'మొత్తం' ఎంతంటే..
దళితులకు ఉచిత విద్యుత్తు అనే కారణంతో ఏళ్లుగా అధికారులు రీడింగ్ తీయలేదని.. ఇప్పుడు తమకు వేసిన బిల్లు చెల్లించాలంటే మా ఇల్లు అమ్మినా బకాయి తీరదని పుల్లయ్య కుమారుడు సైదులు వాపోయారు. అధికారులను అడిగితే పొంతన లేని సమాధానాలు చెబుతున్నారని.. ఇంత బిల్లు రావడంతో ఏం చేయాలో తోచడం లేదన్నారు. దీనిపై ఏఈ శ్రీకాంత్‌రెడ్డిని వివరణ కోరగా.. గతంలో పని చేసిన సిబ్బంది నెలనెలా రీడింగ్ తీయకపోవడంతో ఈ పరిస్థితి వచ్చిందని.. సమస్యను పరిష్కరించేందుకు తగు చర్యలు తీసుకుంటామని తెలిపారు.
ఇవీ చూడండి..Ground Nuts: పెట్టుబడి పైపైకి.. దిగుబడి పాతాళానికి..