ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

సీఎం సహాయనిధికి పెద్ద ఎత్తున విరాళాలు - ముఖ్యమంత్రి సహాయనిధి వార్తలు

కోవిడ్‌ - 19 నివారణలో భాగంగా సహాయచర్యల కోసం ముఖ్యమంత్రి సహాయనిధికి పెద్ద ఎత్తున విరాళాలు సమకూరుతున్నాయి. కేసీపీ షుగర్‌ అండ్‌ ఇండస్ట్రీస్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌ కోటి రూపాయలు.. అనపర్తి వైకాపా నేతలు, కార్యకర్తలు 64.50 లక్షల రూపాయలు విరాళాలు అందించారు.

Huge donations to CM relief fund
సీఎం జగన్​కు చెక్కు అందజేస్తున్న దాతలు

By

Published : Jun 8, 2020, 10:52 PM IST

కరోనా కట్టడి చర్యల కోసం సీఎం సహాయనిధికి విరాళాలు వెల్లువెత్తుతున్నాయి. కేసీపీ షుగర్‌ అండ్‌ ఇండస్ట్రీస్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌ రూ.కోటి విరాళం ప్రకటించింది. ఆ చెక్కును సీఎం జగన్‌కు కేసీపీ ఇండస్ట్రీస్ ప్రతినిధులు అందజేశారు.

తూర్పుగోదావరి జిల్లా అనపర్తి నియోజకవర్గ వ్యాపారవేత్తలు, స్వచ్ఛంద సంస్థలు కూడా సీఎం సహాయనిధికి విరాళం ప్రకటించాయి. వైకాపా నేతలు, కార్యకర్తలు కలిసి రూ.64.50 లక్షలు విరాళం అందజేశారు. ఈ చెక్కులను అనపర్తి ఎమ్మెల్యే సత్తి సూర్యనారాయణ రెడ్డి సీఎం జగన్​కు అందజేశారు.

ABOUT THE AUTHOR

...view details