జగన్ రెడ్డి చెత్త పాలనలో న్యాయం కోసం రోజుకో రైతు రోడ్డెక్కాల్సిన దుస్థితి ఏర్పడిందని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ధ్వజమెత్తారు. అనంతపురం జిల్లా హిందూపురం నియోజకవర్గం రాచపల్లిలో పరిహారం ఇవ్వకుండానే రైతు వేమారెడ్డి భూమి లాక్కోవటం దారుణమని ఆయన మండిపడ్డారు. స్వయంగా మంత్రి అనుచరులే జేసీబీలతో దౌర్జన్యంగా గండి కొట్టి పొలాలు మీదుగా నీటిని మళ్లించారని లోకేశ్ ఆరోపించారు. వేమారెడ్డికి తక్షణమే న్యాయం చేయటంతో పాటు.. అక్రమార్కులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. రైతు వేమారెడ్డి ఆవేదన వ్యక్తం చేస్తూ తీసుకున్న సెల్ఫీ వీడియోపై ఆయన ఇలా స్పందించారు.
Nara Lokesh: పరిహారం ఇవ్వకుండా భూమి లాక్కోవడమేంటి..?: నారా లోకేశ్
జగన్ రెడ్డి చెత్త పాలనలో న్యాయం కోసం రోజుకో రైతు రోడ్డెక్కాల్సిన దుస్థితి ఏర్పడిందని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ధ్వజమెత్తారు. అనంతపురం జిల్లా రాచపల్లిలో పరిహారం ఇవ్వకుండానే రైతు వేమారెడ్డి భూమి లాక్కోవటం దారుణమని మండిపడ్డారు.
పరిహారం ఇవ్వకుండా భూమి లాక్కోవడమేంటి ..? -నారా లోకేశ్
Last Updated : Oct 6, 2021, 8:38 AM IST