అమరావతి నుంచి కర్నూలుకు ప్రభుత్వ కార్యాలయాలను తరలిస్తూ రాష్ట్ర ప్రభుత్వం జీవో జారీ చేయటంపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ స్పందించారు. కమిషనర్ ఆఫ్ ఎంక్వైరీస్, రాష్ట్ర విజిలెన్స్ కమిషనర్ కార్యాలయాలను తరలించటంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజలు మిమ్మల్ని నమ్మి 151 మంది ఎమ్మెల్యేలను గెలిపించింది మోసం చేయటానికా అని ప్రశ్నించారు. రాష్ట్ర సచివాలయం ఆధ్వర్యంలో పనిచేయాల్సిన రాష్ట్ర విజిలెన్స్ కమిషనర్ కార్యాలయాన్ని కర్నూలుకు ఎందుకు తరలిస్తున్నారో అందులో పనిచేసేవారికీ అర్థం కాకుండా ఉందన్నారు. జీవో నెంబర్ 13 విడుదలైనప్పుడే ఇది రాజధాని తరలింపుపై దాఖలైన కేసుల పరిధిలోకి వస్తుందని న్యాయనిపుణులు అభిప్రాయపడిన విషయాన్ని పవన్ గుర్తు చేశారు. వారు అనుకున్న విధంగానే ఈ జీవో హైకోర్టు ముందుకు వచ్చిందని... ఇకనైనా వైకాపా సర్కారు దొడ్డి దారిన చీకటి జీవోలు ఇవ్వడం ఆపాలని హితవు పలికారు.
'అమరావతి నుంచి ఆ కార్యాలయాలను ఎలా తరలిస్తారు..?'
కమిషనర్ ఆఫ్ ఎంక్వైరీస్, రాష్ట్ర విజిలెన్స్ కమిషనర్ కార్యాలయాలను కర్నూలుకు తరలిస్తూ... ప్రభుత్వం జీవో జారీ చేయటంపై జనసేన అధ్యక్షుడు పవన్ మండిపడ్డారు. ప్రజలను మోసం చేస్తూ... చీకటి జీవోలు ఇవ్వటం ఆపాలని సూచించారు.
అమరాతిని నుంచి ఆ కార్యాలయాలను ఎలా తరలిస్తారు?