పిల్లల ఎదుగుదలకు ఎంతగానో దోహదం చేసే పాలు వారు ఇష్టంగా తాగాలంటే.. రకరకాల పండ్లతో స్మూతీలు, మిల్క్‌షేక్స్‌గా తయారు చేసి వారికి అందించాలి. అయితే వీటి తయారీలో పండ్ల పరిమాణం కాస్త తక్కువగా, పాల పరిమాణం ఎక్కువగా ఉండేలా చూసుకోవాలి. తద్వారా ఎక్కువ మొత్తంలో పాలు వారికి అందించవచ్చు. అలాగే 'ఎక్కువ తియ్యగా ఉంటే త్వరగా తాగుతారు కదా..' అని చక్కెర మరీ అధికంగా వేయకూడదు. ఎందుకంటే మొదట వారికి ఎక్కువ తీపితో అందించి.. తర్వాత క్రమంగా తీపి తగ్గిస్తే వారు ఇవి కూడా తాగకపోవచ్చు. అలాగే అధిక చక్కెర వినియోగించడం వల్ల ఇతరత్రా ఆరోగ్య సమస్యలు తలెత్తే అవకాశం కూడా ఉంటుంది. |
పాలు వద్దంటున్నారా..? రుచిగా.. అందించేద్దామిలా! - తెలంగాణ వార్తలు
పిల్లలకు పాలు బలవర్థకమైన ఆహారం అన్న సంగతి తెలిసిందే. ఇంకా చెప్పాలంటే పుట్టగానే వారికి మొట్టమొదట అందే ఆహారం కూడా అదే. అయితే పిల్లలు పసితనంలో తాగే తల్లిపాల ద్వారా వారి ఎదుగుదలకు కావాల్సిన పోషకాలన్నీ అందడంతో పాటు అవి వారికి ఎంతో రుచిగానూ ఉంటాయి. కానీ పెరిగే క్రమంలో ఇచ్చే సాధారణ పాలు అంతగా రుచించక చాలామంది పిల్లలు పాలు తాగడానికి వెనుకాడుతూ.. తల్లిని పదే పదే సతాయిస్తుంటారు. ఫలితంగా పాల ద్వారా వారి శరీర ఎదుగుదలకు అందాల్సిన పోషకాలు అందకుండాపోతాయి. అలాగని వారిని పట్టించుకోకుండా వదిలేయలేం. కాబట్టి రోజూ పిల్లలు తాగే పాలు మరింత రుచికరంగా తయారు చేయాలి. అప్పుడే వారు మరింత ఇష్టంతో వాటిని తీసుకోగలుగుతారు. మరి పిల్లలకు రుచికరమైన పాలు అందించడమెలాగో తెలుసుకుందాం.. రండి.
స్వీట్లంటే కేవలం బయట నుంచి తెచ్చుకున్నవే కాదు.. ఇంట్లోనూ తయారు చేసుకోవచ్చు. ఇందులో భాగంగా ఇంట్లో చేసే సేమ్యా, కలాకండ్, ఖీర్.. మొదలైన మిఠాయిల్లో పాలు అధికంగా ఉపయోగిస్తుంటారు. కాబట్టి పిల్లలకు ఎక్కువగా ఇలాంటి తీపి పదార్థాలు చేసి అందించాలి. ఫలితంగా స్వీట్ల రూపంలోనూ పాలు వారికి అందించవచ్చు. అలాగే పిల్లలకు ఐస్‌క్రీమ్ అంటే ఎంతిష్టమో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కాబట్టి ఇంట్లోనే పాలతో ఐస్‌క్రీమ్ తయారు చేయవచ్చు. వీటితోపాటు పిల్లలకు ఇవ్వడానికి తయారు చేసే కేక్స్, బిస్కెట్స్, ఓట్‌మీల్, పాస్తా.. వంటి పదార్థాల్లో నీళ్లకు బదులుగా పాలను ఎక్కువగా ఉపయోగించడం కూడా మంచిదే.
పిల్లలకు బలవర్థకమైన పాలను రుచిగా ఎలా అందించాలో తెలుసుకున్నారు కదా! మరి మీరు కూడా మీ పిల్లల విషయంలో ఓసారి ఇలా ప్రయత్నించి చూడండి. వారి సంపూర్ణ ఎదుగుదలకు సహకరించండి.
ఇదీ చదవండి: