ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Nov 15, 2020, 5:53 PM IST

ETV Bharat / city

ఈ-మెయిల్ హ్యాక్ అయిందో లేదో తెలుసుకోవడం ఎలా?

ఈ-మెయిల్ వినియోగదారులు కొన్ని జాగ్రత్తలు తప్పక పాటించాలని అంటున్నారు సైబర్ నిపుణులు. మీరు వాడే ఈ-మెయిల్ ఖాతాను ఇప్పటికే సైబర్ నేరగాళ్లు తమ ఆధీనంలో తీసుకుని ఉండే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు. అయితే మీ మెయిల్ హ్యాక్ అయిందో లేదో తెలుసుకోవాలంటే ఏం చేయాలో ఈ కథనంలో చూసేయండి.

email
email

సైబర్ నిపుణుడు సాయిసతీష్ సలహాలు

ప్రస్తుత అంతర్జాల యుగంలో ఈ-మెయిల్ తెలియని వారుండరు. ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది దీనిని ఉపయోగిస్తున్నారు. ఒకటి కంటే ఎక్కువ ఈ-మెయిల్ ఖాతాలను కలిగిన వారు చాలా మందే ఉంటారు. వ్యక్తిగత ఫొటోలు, వీడియోలు, సమాచారాన్ని అందులో దాచుకుంటుంటారు. అయితే కొన్ని జాగ్రత్తలు పాటించకపోతే మీ ఈ-మెయిల్ ఖాతాలు హ్యాక్​కు గురవుతాయని హెచ్చరిస్తున్నారు సైబర్ నిపుణులు. ఇదే జరిగితే మీ బ్యాంకు ఖాతాల వివరాలు, వ్యక్తిగత సమాచారం దోపిడీకి గురవుతాయని చెబుతున్నారు.

ఎలా హ్యాక్ చేస్తారు?

స్పామ్ మెసేజ్​లు, ఫైల్స్​కు చిన్న చిన్న ఏపీకే ఫైల్స్ అనుసంధానం చేసి ఇతరులకు సైబర్ నేరగాళ్లు పంపుతున్నారు. వాటిని క్లిక్ చేయగానే వైరస్ కంప్యూటర్​లో ఇన్​స్టాల్ అవుతుంది. దీనివల్ల ఈ-మెయిల్ ఖాతాదారుల వ్యక్తిగత సమాచారం నేరస్తుల చేతిలోకి వెళుతుంది. అంతేకాకుండా మెయిల్​కు​ ఇచ్చిన పాస్​వర్డ్​నే వేరే బ్రౌజర్లు, బ్యాంకు ఖాతాలకు ఇస్తే వాటిని సైతం నిందితులు హ్యాక్ చేసే అవకాశముంటుందని సైబర్ నిపుణులు హెచ్చరిస్తున్నారు. చాలామంది మెయిల్స్ ఇప్పటికే ఎన్నోసార్లు హ్యాక్ అయి ఉంటాయని చెపుతున్నారు.

హ్యాక్ అయిందో లేదో తెలుసుకోవాలంటే?

మీ రహస్యాలు ఎవరికైనా వెళుతున్నాయని అనుమానం వస్తే haveibeenpwned.comలోకి వెళ్లండి. అక్కడి సర్చ్ ఇంజన్​లో మీ మెయిల్ ఐడీ టైప్ చేయండి. దీనివల్ల మీ ఖాతా ఎన్నిసార్లు ఏ బ్రౌజింగ్​లో హ్యాకింగ్​కు గురైందో తెలుస్తుందని సైబర్ నిపుణులు సూచిస్తున్నారు.

హ్యాకింగ్​కు గురికాకుండా ఉండాలంటే?

మెయిల్స్ హ్యాకింగ్​కు గురికాకుండా ఉండాలంటే కొన్ని జాగ్రత్తలు తప్పనిసరిగా పాటించాలి.

  • మీ పాస్​వర్డ్స్​ను ఇతర వెబ్​సైట్లలో పొందుపరచకూడదు
  • లాగిన్ అయిన ప్రతిసారి ఓటీపీ వచ్చేలా 'టూ ఫ్యాక్టర్ అతెంటికేషన్'​ను వినియోగించండి
  • అపరిచితుల నుంచి వచ్చిన మెసేజ్​లోని వైబ్​సైట్​ లింకులను ఎట్టిపరిస్థితిల్లోనూ తెరవద్దు
  • ఏపీకే ఫైళ్లను డౌన్​లోడ్ చేయకండి

సైబర్ నిపుణుల మరిన్ని సలహాల కోసం పూర్తి వీడియోను చూడండి.

ABOUT THE AUTHOR

...view details