సబ్బుతో చేతులు శుభ్రం చేసుకోవటం వల్ల చేతుల మీద ఉండే బ్యాక్టీరియా, వైరస్ లాంటి సూక్షజీవుల నుంచి రక్షణ లభిస్తోంది. ఎందుకంటే వాటిని నాశనం చేయగల అణు ధర్మాలు సబ్బుకు ఉన్నాయి.
ఇలా చేయండి..
⦁ చేతులను 20 సెకన్ల పాటు సబ్బుతో రుద్ది కడుక్కోవాలి. ఇలా చేస్తే చేతుల మీద ఉందే వైరస్, అది కరోనా అయినా.. నీటితోపాటు కొట్టుకుపోతుంది. సబ్బులో ఉండే హైబ్రిడ్ నిర్మాణమే ఇందుకు కారణం.
⦁ సబ్బు అణువుకు ఉండే తలభాగాన్ని హైడ్రోఫిలిక్, తోక భాగాన్ని హైడ్రోఫోబిక్ అంటారు. పై భాగం నీటితో, కింది భాగం నూనె, కొవ్వు వంటి వాటితో అనుసంధానం అవుతుంది. ఈ ప్రత్యేక లక్షణమే మన చర్మానికి, వైరస్‌కు మధ్య ఉండే పదార్థాన్ని తొలగించగలుగుతుంది. మనం నీటితో చేతులు కడిగినప్పుడు.. నీరు, సబ్బు అణువుకున్న హైడ్రోఫిలిక్ తనతో తీసుకుపోతుంది.
⦁ సబ్బు అణువు తోకభాగం వద్ద ఉన్న నూనె, కొవ్వులు వైరస్‌ను తొలగించే గుణాన్ని కలిగి ఉంటాయి. తరచూ సబ్బుతో చేతులు కడుక్కోవడం వల్ల వైరస్ బారిన పడకుండా మనల్ని మనం కాపాడుకోవచ్చు.
ఇదీ చదవండి:
శానిటైజర్లు అతిగా వాడినా ప్రమాదమే!