విశాఖలో...
రాష్ట్రంలో ఇళ్ల స్థలాల పట్టాల పంపిణీ పూర్తి పారదర్శకంగా చేపట్టినట్లు ఎంపీ విజయసాయిరెడ్డి తెలిపారు. విశాఖ నగర దక్షిణ నియోజకవర్గం ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు. అర్హులైన వారికి పట్టాలు అందజేశారు. పట్టాల పంపిణీ కార్యక్రమాన్ని అడ్డుకునేందుకు ప్రతిపక్షం చేస్తున్న ప్రయత్నాలు ఫలించవని అన్నారు.
కర్నూలు జిల్లాలో..
కర్నూలు జిల్లా ప్యాపిలిలో ఇళ్ల పట్టాల కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి అర్హులైన వారికి పట్టాలను అందజేశారు. సచివాలయ సిబ్బంది, వాలంటీరులు అంకిత భావంతో పని చేయాలని సూచించారు.
గుంటూరు జిల్లాలో...
గుంటూరు జిల్లా మాచర్లలోని జయంతి నగర్లో పేదలకు ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమంలో.. ఎంపీ లావు కృష్ణదేవరాయలు పాల్గొన్నారు. లబ్ధిదారులకు ఇళ్ల పట్టాలను అందజేశారు. పల్నాటి ప్రజల చిరకాల కోరిక వరికపూడిశెల ప్రాజెక్టుకు త్వరలోనే శ్రీకారం చుడతామమి ప్రకటించారు.
పార్టీలకు అతీతంగా వైకాపా ప్రభుత్వం అభివృద్ధి సంక్షేమ పథకాలను అందిస్తోందని నరసరావుపేట ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి అన్నారు. గుంటూరు జిల్లా రొంపిచర్ల మండలం విప్పర్లలో ఏర్పాటు చేసిన పేదలకు ఇళ్ల స్థలాల పంపిణీ కార్యక్రమంలో గోపిరెడ్డి పాల్గొన్నారు.
ఇదీ చదవండి:
'పునరావాసం పూర్తిచేయకుంటే ఇబ్బందే'