జగనన్న కాలనీలు పథకంలో భాగంగా ఫ్రభుత్వం పట్టణాల్లో ఒకటిన్నర సెంట్ల ఇంటి స్థలం గూడులేని పేదలకు ఆగస్టు 15న అందించనుంది. ఆగస్టు 26న ఆ స్థలాల్లో 15లక్షల ఇళ్ల నిర్మాణాలను ప్రారంభించనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. ఆ ఇంటి నమూనాను అధికారులు సిద్ధం చేశారు. హాలు, వంట గది, ఒక పడక గది, స్నానాల గదితో నిర్మించారు. మిగతా స్థలం ఖాళీగా వదిలేలా ఏర్పాటు చేశారు. గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం సీతానగరం బోట్ యార్డు దగ్గర దీనిని ఏర్పాటు చేశారు.
పేదల కుటీరం ఇదే...!! - కొత్తగా ఇళ్ల నిర్మాణం వార్తలు
జగనన్న కాలనీలు పథకంలో భాగంగా ఫ్రభుత్వం పట్టణాల్లో ఒకటిన్నర సెంట్ల ఇంటి స్థలం గూడులేని పేదలకు ఆగస్టు 15న అందించనుంది.
పేదలకు ఇచ్చే ఇళ్లు