ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

రూ. 1.95 లక్షలతో ఇంటి నిర్మాణం

గృహ నిర్మాణ పథకంలో భాగంగా లబ్దిదారులకు రూ. 1.95 లక్షల వ్యయంతో ఇంటి నిర్మాణాన్ని పూర్తి చేసేలా అధికారులు ప్రణాళిక సిద్ధం చేశారు. సిమెంటు నుంచి రంగుల దాకా లబ్దిదారుల చెంతకే అందించేందుకు కసరత్తు ప్రారంభించారు.

house construction scheme to poor people below 2 lakh rupees
గృహ నిర్మాణ పథకంలో భాగంగా లబ్దదారులకు రూ. 1.95 లక్షల వ్యయంతో ఇంటి నిర్మాణం

By

Published : Jul 27, 2020, 9:26 AM IST

రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా చేపట్టనున్న గృహ నిర్మాణ పథకంలో భాగంగా లబ్దిదారులకు రూ. 1.95 లక్షల వ్యయంతో ఇంటి నిర్మాణాన్ని పూర్తి చేసేలా అధికారులు ప్రణాళిక సిద్ధం చేశారు. ఈ మొత్తంతో నిర్మాణం పూర్తయ్యేందుకు వీలుగా వారి చెంతకే ఇంటి నిర్మాణ సామగ్రిని చేరవేయాలని నిర్ణయించారు. ఇసుకను ఉచితంగా అందిస్తారు. సిమెంటు బస్తా రూ. 225కు ఇవ్వనున్నారు. ఇటుకలు, ఇనుప కడ్డీలు, తలుపులు, కిటికీలు, విద్యుత్తు పరికరాలు, శానిటరీ వస్తువులు, రంగులు మార్కెట్​ ధర కంటే తక్కువకు అందించేందుకు అధికారులు కసరత్తు ప్రారంభించారు. ఇప్పటికే నిర్దేశిత మొత్తంలో గుంటూరు జిల్లా తాడేపల్లిలో నమూనా గృహాన్ని నిర్మించారు.

  • వైఎస్సార్​ జగనన్న కాలనీలు

కొత్తగా చేపట్టనున్న గృహనిర్మాణ పథకానికి వైఎస్సార్​ జగనన్న కాలనీలుగా పేరు ఖరారు చేశారు. మొదటి విడతగా ఆగస్టు 26న 15 లక్షల మందికి ప్రభుత్వం ఇళ్లు మంజూరు చేయనుంది. లబ్దిదారులు సొంతంగా లేదా అధికారుల పర్యవేక్షణలో నిర్మాణాన్ని పూర్తి చేసుకోవచ్చు. ఇటుకలు, తలుపులు, కిటికీలను నిర్మితి కేంద్రాల్లో తయారు చేసి లబ్దిదారులకు అందిస్తారు. గ్రామీణ, పట్టణ పరిధిలో మేస్త్రీలు, ప్లంబర్లు, కార్పెంటర్లు, ఎలక్ట్రీషియన్లు ఎంతమంది ఉన్నారో గుర్తించి గృహ నిర్మాణ శాఖ వెబ్​సైట్​లో నమోదు చేయనున్నారు. లబ్దిదారులను సంప్రదించి వీరికి ఇళ్ల నిర్మాణ పనులు అప్పగిస్తారు.

  • ఇంటి సామగ్రి విలువ రూ. 1.25 లక్షలు

నమూనా ఇంటి నిర్మాణంలో హాలు, కిచెన్​, పడకగది, మరుగుదొడ్డి, వరండా ఉన్నాయి. వీటికి అవసరమైన సామగ్రి కొనుగోలుకు రూ. 1.25 లక్షలు అయినట్లు అధికారులు లెక్కవేశారు. నిర్మాణ కార్మికుల ఖర్చు కింద రూ. 55 వేలు చూపించారు. మొత్తంగా రూ. 1.80 లక్షల ఖర్చుతో ఇంటిని, రూ. 15 వేలతో వరండా నిర్మాణాన్ని పూర్తి చేశారు.

ఇదీ చదవండి :

ఇళ్ల స్థలాలను పరిశీలించిన అమలాపురం ఆర్డీవో

ABOUT THE AUTHOR

...view details