ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

సీఎం జగన్‌కు భవన నిర్మాణ కార్మికుల సలహా బోర్డు కేంద్ర ఛైర్మన్‌ లేఖ - నిర్మాణ కార్మికుల సలహా బోర్డు కేంద్ర ఛైర్మన్‌

భవన నిర్మాణ కార్మికులకు ఆర్థిక సాయం అందించాలంటూ.. ఆ విభాగం సలహా బోర్డు కేంద్ర ఛైర్మన్‌ వి.శ్రీనివాసనాయుడు రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. ఇసుక కొరత, కొవిడ్ కారణంగా రెండేళ్లుగా తీవ్ర దుర్భర పరిస్థితులు ఎదుర్కొంటున్నారంటూ లేఖలో పేర్కొన్నారు.

srinivasa naidu, house construction association letter to cm jagan
శ్రీనివాస నాయుడు, సీఎం జగన్‌కు భవన నిర్మాణ మండలి లేఖ

By

Published : Apr 23, 2021, 9:25 AM IST

కరోనా విపత్కర పరిస్థితిల్లో భవన నిర్మాణరంగ కార్మికులను ఆదుకోవాలని కోరుతూ.. భవన, ఇతర నిర్మాణ కార్మికుల సలహా బోర్డు కేంద్ర ఛైర్మన్‌ వి. శ్రీనివాసనాయుడు సీఎం జగన్‌కు లేఖ రాశారు. భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ మండలి బోర్డు ద్వారా రాష్ట్ర ప్రభుత్వం వారికి రూ. 5 వేల వంతున ఆర్థిక సాయం అందించాలని కోరారు. ఒక వైపు కొవిడ్, మరోవైపు ఇసుక కొరతతో కార్మికులు రెండేళ్లుగా నానా ఇబ్బందులు పడుతున్నారన్నారని గుర్తు చేశారు. వారు ఆకలితో అలమటించే పరిస్థితి ఏర్పడిందన్నారు.

నవరత్నాల ద్వారా అతి కొద్ది మందికి ఊరటనిచ్చినా.. అది తాత్కాలికమేనని శ్రీనివాస నాయుడు అభిప్రాయపడ్డారు. కేంద్రప్రభుత్వం గత సంవత్సరంలో ప్రకటించిన విధంగా రాష్ట్రంలో భవన నిర్మాణ కార్మికుల పిల్లలకు ఉపకారవేతనం ఇప్పటివరకు అందలేదని లేఖలో పేర్కొన్నారు. వారికి పలు ప్రయోజనాలు అందేలా సుప్రీంకోర్టు సూచనతో భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ మండలిని 2009లో రాజశేఖర్ రెడ్డి ఏర్పాటు చేశారని గుర్తు చేశారు. ఇంతవరకు దాన్ని పునరుద్ధరించలేదని తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details